అడైక్కన్ అనే 40 ఏళ్ల వ్యక్తి తన భార్య కుమార్తె తో కలిసి నివాసం ఉంటున్నాడు. 1999 నుంచి ఆటోమొబైల్ ఫ్యాక్టరీలో టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు సదరు వ్యక్తి. అడైక్కన్ 2019 ఆగస్టులో రోజు లాగానే విధులకు వెళ్లి మళ్ళీ తిరిగి రాలేదు. అతని భార్య భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం ఎంత గాలింపు చర్యలుచేపట్టినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఇటీవలే కేసు విచారణలో భాగంగా అసలు విషయం బయటపడింది. 2019 ఫిబ్రవరి నెలలో తన భర్త అకౌంట్ నుంచి 3.5 లక్షలు భర్త అన్న భార్య చిత్ర అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయినట్లు అడైక్కన్ భార్య గుర్తించింది. ఈ క్రమంలోనే పోలీసులను ఆశ్రయించింది. అయితే పెళ్లికాక ముందు నుంచే అడైక్కన్ కు అతని అన్న భార్యతో వివాహేతర సంబంధం కొనసాగించిన్నట్లు విచారణలో తేలింది. పెళ్లి తర్వాత కూడావివాహేతర సంబంధం కొనసాగించాలనే ఒత్తిడి తీసుకొచ్చాడు అడైక్కన్. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఎంత చెప్పినా వినక పోవడంతో అడైక్కన్ ను హతమార్చాలని నిర్ణయానికి వచ్చింది చిత్ర.
ఈ క్రమంలోనే పథకం ప్రకారం ఒక నిర్మానుష్య ప్రాంతానికి రమ్మని పిలిచి ఇక అక్కడ ఓ గ్యాంగ్ కి సుపారీ ఇచ్చి మరీ దారుణంగా హత్య చేయించింది. ఆ తర్వాత అతని మృతదేహాన్ని కాంక్రీట్ సిమెంట్ తో సీల్ చేసింది. దాదాపు 18 నెలల తర్వాత ఆ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలోనే హత్యలో ప్రధాన సూత్రధారి అయిన చిత్ర ఆమె కుమారుడు రంజిత్ సహా మరో నలుగురిని అరెస్టు చేశారు. ఇక వారిపై కిడ్నాప్ మర్డర్ కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.