ఆజాధి కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ప్రారంభం కార్యక్రమానికి వరంగల్ నగరానికి విచ్చేసిన గవర్నర్ శ్రీమతి తమిళ సై  సౌందరరాజన్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారు,అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు,పరకాల నియోజకవర్గ ఇన్చార్జి పెసరు విజయ చందర్ రెడ్డి గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట 75 వసంతాల స్వాతంత్య్రపు సంబురాలకు రాష్ట్రం సమాయత్తమైంది. వరంగల్ లో ఈ వేడుకలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు.

దేశానికి స్వాతంత్య్రం లభించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ అంబరాన్నంటే వేడుకలకు యావద్దేశం సిద్ధమైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట 75 ఏళ్ల స్వాతంత్య్రపు సంబురాలకు తెలంగాణ రాష్ట్రం కూడా ముస్తాబైంది. వరంగల్ నగరంలో నిర్వహించిన ఈ వేడుకలకు తెలంగాణ  గవర్నర్  శ్రీమతి తమిళ సై  సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతోన్న ఈ కార్యక్రమాన్ని తమిళిసై ప్రారంభించారు. జాతీయ పతాకం ఆవిష్కరించిన గవర్నర్.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వతంత్ర భారతం అనేక రంగాల్లో గణనీయమైన విజయం సాధించిందని అన్నారు.

మంగళ్ యాన్ నుంచి బుల్లెట్ రైలు వరకు అనేక రంగాల్లో పురోగతి సాధించిందని తెలిపారు. ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ అందించే స్థాయికి చేరిందని పునరుద్ఘాటించారు. 50 దేశాలకు పైగా కొవిడ్ టీకా సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో ముమ్మరంగా కొవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతోందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగాల్లో భారత యువతదే కీలకపాత్ర అని తమిళిసై పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: