ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది జనాలను మోసం చేయడానికి పరాయివాళ్ళు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటే సొంత వారు వారు సైతం ఇక మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. బంధాలు బంధుత్వాలు మరిచి ఏకంగా మోసం చేసి బోల్తా పుట్టిస్తున్నారు  ఎంతోమంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 రక్తం పంచుకుని పుట్టిన కన్న కూతురే  తల్లిదండ్రులను మోసం చేయాలని అనుకున్నది.  ఈ క్రమంలోనే అప్పటివరకు తల్లిదండ్రులను కాస్తయినా పట్టించుకోని కూతురు ఇక మోసం చేయడానికి ఎక్కడలేని ప్రేమ చూపించి డ్రామాలు ఆడింది. కానీ చివరికి తల్లిదండ్రులను రోడ్డున పడేసింది. అయితే ఇక వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు అటు కూతురికి ఊహించని షాక్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిన..  పెడన బ్రహ్మ పురం 21వ వార్డు కు చెందిన కొండ బ్రహ్మానందం భార్యతో కలిసి నివాసముంటున్నాడు.



 అయితే ఇటీవలే తల్లిదండ్రుల ఇద్దరి బాధ్యత తానే  చూసుకుంటాను అంటూ ఏలూరు లో నివాసం ఉంటున్న కూతురు లక్ష్మీ చెప్పింది.  కన్నబిడ్డ అలా అనడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.  ప్రేమ నిజమే అని నమ్మిన తల్లిదండ్రులు తమ దగ్గర ఉన్న 473 చదరపు గజాల కూతురికి రాసిచ్చారు .  ఇక ఆస్తి కూతురు చేతికి వెళ్లిందో లేదో అసలు స్వరూపం బయట పడింది. ఇక ఆస్తి చేతికి వచ్చాక తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేసింది కూతురు. దీంతో షాక్ అయ్యారు తల్లిదండ్రులు.  కూతురు తమను మోసం చేసింది అంటు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి ఫిర్యాదు చేశారు.  ఈ క్రమంలోనే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: