ఏపీ రాజకీయాలలో జనసేన స్టాండ్ ఏమిటో ఇప్పటికీ చాలా మందికి అర్ధం కావడం లేదు. కొంత కాలం టీడీపీతో పొత్తులో ఉంటుందు. మరి కొంతకాలం బీజేపీతో జతకడుతుంది. జనసేనాని ఎప్పుడు ఏమి ఆలోచిస్తాడో ఎవ్వరికీ అంతుపట్టదు. గతంలో 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో అటు బీజేపీ టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ తరపున ప్రచారాల్లో విరివిగా పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దాని తరువాత జరిగిన పరిణామాలు అంటే టీడీపీ కింది స్థాయి కార్యకర్తల వ్యాఖ్యలు బీజేపీ ఆగ్రహానికి కారణమయ్యాయి. కేవలం టీడీపీ వల్లనే ఈ రోజు ఏపీలో బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందని ప్రచారాలు ఎక్కువవడంతో కొన్ని వివాదాల నడుమ బీజేపీ టీడీపీతో విడిపోయింది. అదే సమయంలో టీడీపీ నుండి జనసేన కూడా విడిపోయింది.

అయితే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో జనసేన సత్తా చాటడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చినట్లయింది. ఇందులో భాగంగానే జనసేన పార్టీలో కొత్త బలం వచ్చినట్లయింది. దీనితో కింది స్థాయి కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా రక రకాల పోస్టులు పెట్టడంతో, పార్టీ లోని మరి కొంతమంది ఇలాంటివి పెట్టడం కరెక్ట్ కాదు. ఇలా జరుగుతున్న సమయంలోనే జనసేన నుండి ఒక ప్రకటన వెలువడింది. త్వరలో తిరుపతిలో జరగనున్న ఎంపీ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయడం లేదు అనే విషయం బయటకు వచ్చింది. మాకు తిరుపతి అభివృద్ధితో పాటుగా   రాష్ట్రము మేలుకోసమే ఈ నిర్ణయమని స్వయంగా పవన్ కళ్యాణ్ సంతకంతో ఒక నోటు వెలువడింది. ఈ నోటులో తిరుపతి ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీని బలపరచాలని నిర్ణయించుకున్నాము.

బీజేపీ జాతీయ స్థాయి నాయకులతో పలు మార్లు చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని ఉంది.  ముఖ్యంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నడ్డా మరియు బి ఎల్ సంతోష్ గార్లతో లోతైన చర్చ జరిగింది. తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తామని బీజేపీ మాటిచ్చింది. వైసీపీ అరాచకాలను అణిచేందుకే బీజేపీతో కలిసి ముందుకెళుతున్నాము. ఈ విషయాన్ని ప్రతి ఒక్క జనసైనికుడు అర్ధం చేసుకుని తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ విజయానికి సహకారం అందించాలని కోరుకుంటున్నాము.  మరి ఈ విషయాన్ని జనసేన కార్యకర్తలు అర్ధం చేసుకుంటారా లేదా టీడీపీ లాగా వివాదాలతో పార్టీకి దూరమవుతారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: