ఉరుకుల పరుగుల జీవితం ఒత్తిడితో కూడిన ఉద్యోగం..  అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు.. ఆరోగ్యాన్ని పాడు చేసే సరికొత్త పోకడులు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో నేటి రోజులలో జనాలు బాధపడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.  సాధారణంగా మనిషి జీవన శైలిలో తినడానికి పడుకోవడానికి ఉదయం నిద్ర లేవడానికి కూడా ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ నేటి రోజుల్లో మాత్రం సమయం అంటూ ఏదీ లేదు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తినడం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పడుకోవడం..  ఇక ఇష్టం వచ్చినప్పుడు లేవడం లాంటివి చేస్తున్నారు ఎంతో మందిపై  ఆరోగ్య సమస్యలు దూసుకొచ్చి మీద పడి పోతున్నాయి.



 అయితే ఈ మధ్య కాలంలో యువత పెద్దలు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏది అంటే నిద్రలేమి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ప్రస్తుతం అధునాతన జీవనశైలిలో  ఒత్తిడితో కూడిన లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే ఎంతోమంది పడుకున్నప్పటికీ నిద్ర పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  అయితే ఇలా నిద్రపట్టక పోవడానికి కారణాలు ఏమైనప్పటికీ నిద్రపట్టడానికి మాత్రం కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక ఎక్కువ  నిద్ర మాత్రలు వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 అయితే అప్పుడప్పుడు నిద్ర మాత్రలు వేసుకోవడం మంచిదే కానీ నిద్ర మాత్రల వాడకం ఎక్కువ అయితే మాత్రం ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావడమే కాదు కొన్ని కొన్ని సార్లు ఏకంగా ప్రాణాలమీదికి వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. తరచూ నిద్ర మాత్రలు వాడటం వల్ల జ్ఞాపక శక్తి తగ్గడం.. చూపు అస్పష్టం గా మారడం లాంటివి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయట. అంతే కాదు ఒకటి రెండు సార్లు వాడిన తర్వాత ఇక అది జనాలను బానిసలుగా మార్చేస్తుందని ఇక ఆ తర్వాత డోస్ పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు. ఇలాగే కొనసాగితే ఒకానొక సమయంలో ఏకంగా ప్రాణాల మీదికి వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: