వరంగల్‌లోని కేంద్రీయ విద్యాలయం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. విద్యాలయంలోని పలు విభాగాల్లో ఉద్యోగాలను భర్తీకి పచ్చజెండా ఊపింది. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీని కోసం సంస్థ నుంచి నోటిఫికేషన్‌ విడుదలైంది. పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, నర్స్‌, కంప్యూటర్‌ ఇన్స్ట్రక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్పోర్ట్స్ కోచ్, ఎడ్యుకేషనల్ కౌన్సెలర్ తదితర కేటగిరిల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పైన పేర్కొన్న పోస్టులకు సంబంధించి అర్హులెవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని అనుకునే అభ్యర్థులు.. ఆఫ్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://warangal.kvs.ac.in/ వైబ్‌సైట్‌కు లాగిన్ అయి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ పోస్టుల దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 18వ తేదీ వరకు ఉంది.

పోస్టుల వివరాలు..
పీజీటీ: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ, ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్‌, ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ ఉద్యోగానికి ఎంపికైన తర్వాత అభ్యర్థులకు నెలకు రూ.27,500 వరకు జీతం చెల్లిస్తారు.
కంప్యూటర్‌ ఇన్స్ట్రక్టర్: ఈ విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ, పీజీ డిప్లొమా, ఎమ్మెస్సీ ఉత్తీర్ణలై ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,250 జీతం చెల్లిస్తారు.
టీజీటీ: సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఈ ఉద్యోగంలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.26,250 వేతనం ఉంటుంది.
పీఆర్టీ(ప్రైమరీ టీచర్లు): పదో తరగతి, ఇంటర్మీడియేట్‌, డిప్లొమా, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.21,250 వరకు వేతనం చెల్లిస్తారు.
ఎడ్యుకేషన్‌ కౌన్సెలర్‌: సైకాలజీలో బీఏ/బీఎస్సీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.26,250 వరకు వేతనం ఉంటుంది.
స్పోర్స్ట్ కోచ్: ఎంపీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.21,250 వరకు వేతనం చెల్లిస్తారు.
నర్సు: ఈ ఉద్యోగానికి నర్సింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి. ఎంపికైన వారికి రోజుకు రూ. 750 చొప్పున చెల్లిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: