ఆంధ్ర ప్రదేశ్ లో నిన్న టి వరకు అందరిలో ఒకటే ఆలోచన ఉండేది. పుర పాలక ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందా? లేదా ? అని. నిన్న వెలువడిన ఫలితాలు అనుకున్న విధంగానే వైసీపీ అభ్యర్థులకు పట్టం కట్టాయి. ఎక్కడ చుసిన కూడా వైసీపీ జెండా ఎగురుతుంది. గత ఎన్నికల్లో కూడా టీడీపీ వైసీపీకి చివరి వరకు గట్టి పోటీనిచ్చింది. ఇప్పుడు అంతకు మించి అనేలా ప్రచారాన్ని చేశారు. మాజీ ముఖ్య మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేశ్ లు కూడా రోడ్డెక్కి గొంతు విప్పారు.
గెలుపుకోసం కొత్త వ్యూహాలు రచించారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో ఓటర్లను కొనే ప్రయత్నం కూడా చేశారనే వార్తలు వినిపించాయి. అయినా కూడా ఫలితాలు వైసీపీ కి అనుకూలంగా వచ్చాయి. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు పై టీడీపీ ఆశలు పెట్టుకుంది. అక్కడ బాబు ప్రచారంలో జరిగిన తప్పు వల్ల అక్కడ లెక్కలు తప్పాయి. దాంతో తెదేపా నేతలు సీఎం సొంత జిల్లా కడప ను టార్గెట్ చేశారు. ఆ జిల్లాలో పర్యటించక పోయిన స్థానికంగా పోటీలో నిలబడిన అభ్యర్థులు చాలా ప్రయత్నించారు.
కడప ఓట్ల లెక్కింపులో కూడా మొదటి విజయం టీడీపీకి పడటంతో ఈ సారి టీడీపీ బలం పుంజుకుందని ప్రజలు అభిప్రాయాపడ్డారు. గంట గంటకు జనాల్లో ఉత్కంఠ మొదలైంది. టెన్షన్ వాతావరణం లో ఓట్ల లెక్కింపు కొనసాగింది. మధ్యాహ్నం వరకు టీడీపీ కి ఊరట లభించిందని చెప్పాలి. ఆ తరువాత నుంచి వైసీపీ హవా కొనసాగింది. దీంతో కడప నగరం తో సహా అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ విజయ పథకాన్ని ఎగురవేసింది. కేవలం ఒక్క మైదుకూరు లో మాత్రమే టీడీపీ మాట నిలబెట్టుకుంది. మొత్తానికి కడప జిల్లాలో టీడీపీ లెక్క తప్పిందనే విషయం స్పష్టం అవుతుంది.