ఈ మధ్యకాలంలో మనుషుల ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే. చిన్న చిన్న కారణాలకే ఎంతో విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు మనుషులు. అంతేకాదు తమ మీదే ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్న తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తున్నారు. ఇలా చిన్న చిన్న కారణాలకే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి అనే విషయం తెలిసిందే.



 ఇలా చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకోవడంతో  తల్లిదండ్రులకు తీరని  కడుపుకోత మిగిలిపోతుంది. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.  తనకు ద్విచక్ర వాహనాన్ని కొనివ్వాలి అంటూ ఇక్కడ ఒక యువకుడు తన తండ్రిని డబ్బులు అడిగాడు అయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగా లేదని కొన్ని రోజులు అయిన తర్వాత బైక్ కొనిస్తాను అంటూ తండ్రి చెప్పాడు. అయితే ఇక తనకు ఇష్టమైన బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన యువకుడు చివరికి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఈ లోకంలో జీవించడం కూడా వృధా అనుకున్నాడో ఏమో.. చివరికి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.


ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. రామాయం పేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన విష్ణు అనే 20 ఏళ్ల యువకుడు గజ్వేల్ లో పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నాడు. అయితే ఇటీవలే తన తండ్రిని బైక్ కొనివ్వాలి అంటూ అడిగాడు. దీని కోసం లక్ష రూపాయలు ఇవ్వాలి అంటూ తెలిపాడు. అయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఇప్పట్లో బైక్ కొనడం కుదరదు అని చెప్పడంతో మనస్థాపం చెందిన యువకుడు  దౌల్తాబాద్ శివారులో ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఆత్మహత్యకు ముందు తన బంధువు ఫోన్ చేసి అసలు కారణం చెప్పినట్లు తెలుస్తుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: