సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో మట్టిలోని మణిక్యాలు బయటకు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. తమలోని టాలెంట్‏లను వెలికితీస్తున్నాయి. ఇలా ఎంతో మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అలాంటివి సోషల్ మీడియాలో ఎన్నో దర్శనమిస్తుంటాయి. ఇందులో రకారకాల పెయింటింగ్స్ కూడా నెట్టింట్లో ట్రెండ్ అవుతుంటాయి. ఇక అందులో అద్బుతమైన పెయింటింగ్స్ కూడా కనిపిస్తుంటాయి. తాజాగా ఓ యువతికి వచ్చిన ఐడియాకు  ఎన్నో ప్రశంసలు అందుకుంటుంది.

మాడెలిన్ రెక్టర్ అనే ఒక యువతి  తన వద్ద ఉన్న పాత మ్యాగజెన్లను పంచ్ హోల్స్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక అద్భుతమైన బెంగాల్ టైగర్ డ్రాయింగ్ వేసింది. తాను బొమ్మను గీస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. ఈ వీడియోను పరిశీలిస్తే.. మొదట ఆమె ఒక స్లేట్పై స్కెచ్తో బెంగాల్ టైగర్ బొమ్మ వేసింది. ఆ తర్వాత తన వద్ద ఉన్న పాత మ్యాగజెన్లను పంచ్ హోల్స్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది. వివిధ రంగులు, సైజుల్లో ఉన్న ఆ పంచ్ హోల్స్లను బెంగాల్ టైగర్ ఆకారంలో వచ్చేలా క్రమంగా అంతికించింది. ఇదంతా పూర్తవ్వగానే.. ఎటువంటి పెయింటింగ్ అవసరం లేకుండానే, బెంగాల్ టైగర్ బొమ్మ సిద్ధమైంది.


 ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆమె టాలెంట్‏కు ముగ్దులవుతున్నారు. ఆ పెయింటింగ్ వీడియోను షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే లైక్లు, షేర్లతో తెగ వైరల్ చేస్తున్నారు. ఒక్క పెయింట్ కూడా వాడకుండా రంగురంగుల బెంగాల్ టైగర్ బొమ్మను గీయడం చాలా అద్భుతంగా ఉందంటూ.. మీ ఐడియాకు హ్యాట్సాఫ్ అంటూ మాడెలిన్ రెక్టర్ను ప్రశంసిస్తున్నారు. మీరు ఎంత సహనంగా ఈ పెయింటింగ్ రెడి చేసారో చూస్తుంటే అర్థమవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ మాత్రం "ఈ డ్రాయింగ్ వేసేటప్పుడు మీ వేళ్లు నొప్పి వేయలేదా? చాలా అందమైన బొమ్మ గీశారు." అంటూ కామెంట్ చేశాడు. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఇన్ స్టాలో 5000 లైక్స్ వచ్చాయి.











మరింత సమాచారం తెలుసుకోండి: