ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక పేద విద్యార్థులు అందరికీ మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది.  ఇప్పటికే పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టింది జగన్ సర్కార్. పేద విద్యార్థులు అందరూ కూడా బడికి వెళ్ళిన నాటి నుంచి కాలేజీ వరకు కూడా అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు సిద్ధం అయింది. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ విద్యార్థులు అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా జగనన్న వసతి దీవెన,  విద్య దీవెన పథకాలను అందిస్తుంది అన్న విషయం తెలిసిందే.



 ఇక ఈ పథకానికి అర్హులైన ఎంతోమంది పేద విద్యార్థులు అందరూ కూడా ఆయా పథకాల కు దరఖాస్తు చేసుకుని ప్రయోజనం పొందేందుకు కూడా సిద్దం అవుతున్నారు..  గతంలో ఈ పథకాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఒక తేదీని నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. కాగా కాగా ఈ రెండు పథకాలకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు   ప్రభుత్వం నిర్ణయించిన తేదీ ఈ రోజుతో ముగియనుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది విద్యార్థులు వివిధ సాంకేతిక సమస్యల కారణంగా ఇప్పటికీ కూడా జగనన్న వసతి దీవెన, విద్య దీవెన పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇలాంటి నేపథ్యంలోనే విద్యార్థులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని విద్యార్థులందరికీ శుభవార్త చెప్పింది



 జగన్ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న జగనన్న వసతి దీవెన విద్య దీవెన పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే రిజిస్ట్రేషన్ల గడువును పొడిగిస్తూ ఇటీవల జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెల 25వ తేదీ వరకూ ప్రభుత్వం ఈ గడువును పొడిగించింది.  ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం ఈ రెండు పథకాలకు రిజిస్ట్రేషన్ చేయించుకునే చివరితేదీ ఈ రోజే   కావడం గమనార్హం. కాగా జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థులు అందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పొందుతుండగా జగనన్న వసతి దీవెన పథకం లో భాగంగా ఇక విద్యార్థులు తమ కోర్స్ కి అనుగుణంగా ఆర్థిక సహాయం పొందుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు పథకాలకు రిజిస్ట్రేషన్ గడువు పొడగింపు విద్యార్థులకు శుభవార్త అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: