ఇక ఈ సారి ప్రజలందరూ తమ వైపే ఉన్నారని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి అధికారం లోకి రావడం ఖాయం అంటూ కమల హాసన్ చెబుతున్నారు. అయితే కమలహాసన్ పార్టీ పెట్టడం వల్ల అటు అధికార పార్టీకి ఎన్నో ఇబ్బందులు తప్పవు అని భావించిన డీఎంకే పార్టీ.. అసలు ఇబ్బంది తమకే అన్న విషయాన్ని ఇటీవల గ్రహించింది.కమలహాసన్ పార్టీ పెట్టడం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు అన్నీ కూడా కమలహాసన్ వైపు వెళ్లే అవకాశం ఉంది అని భావించిన డీఎంకే నేతలు.. కమలహాసన్ చేస్తున్న ప్రతి పనిని తప్పుబట్టడం విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
ఇటీవలే కరుణానిధి మనవడు ఉదయనిధి ఇటీవలే కమల్హాసన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమిళనాడు రాజకీయాల్లో కమల్ హాసన్ ఒక జోకర్ అని.. ఆయనను ఎవరూ పట్టించుకోరు అంటూ ఉదయనిది ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారిపోయింది. ఇక ఈ విమర్శలను బట్టి డీఎంకే పార్టీ కి కమల్ హాసన్ పార్టీ తపై ఎంత ఫ్రస్టేషన్ ఉంటుంది అన్నది అర్థం అవుతుంది అని అంటున్నారు విశ్లేషకులు. ఇలా క్రమక్రమంగా డీఎంకే పార్టీ కమలహాసన్ ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్లేషకులు తెలిపారు.