ఎన్నికల సర్వేలు ఏం చెబుతున్నాయి అంటే డీఎంకే పార్టీ అధికారం లోకి వస్తుందని అంటున్నాయి. నాలుగైదు సర్వేలు డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశాయి. దీంతో ఆ పార్టీ పెద్దలు వ్యూహాలకు పదును పెట్టారు. పార్టీ నాయకులు గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. మేనిఫెస్టోను విస్తృతంగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు.అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో-కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి బుధవరం సేలంలో భేటీ అయ్యారు.
ఈ ఎన్నికల్లో గెలుపు పై తీసుకోవాల్సిన చర్యల పై చాలా సేపు చర్చలు జరిపారు. కూటమి పార్టీలను కలుపుకుని సమన్వయం తో పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా, నియోజకవర్గ నాయకులకు దిశానిద్దేశం చేశారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అధికారానికి దూరం అవుతామని హెచ్చరికలు పంపారు. దివంత సీఎం జయలలిత విజన్‌ను ప్రజలకు వివరించే విధంగా ప్రచార కార్యక్రమాలకు సిద్ధమయ్యారని ఓ నేత పేర్కొన్నారు.పళనికి మద్దతు పలకాలని, అమ్మ పాలన కొనసాగాలంటే అన్నాడీఎంకే పార్టీకి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.. ఇక ఆ పార్టీ కూడా అదే విధంగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. చివరికి సర్వేల మాట నిజమవుతుందా లేదా ప్రజల తీర్పు నిజమవుతుందా అనేది ఆసక్తి గా మారింది..