ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన ఏపీ, తెలంగాణ మధ్య అన్ని విషయాల్లోనూ పోలిక వస్తూనే ఉంటుంది. ఇది సహజం. విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రం ఎలాంటి పథకాలు అమలు చేస్తోంది.. ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే అంశాలపై రెండు రాష్ట్రాల ప్రజలు చర్చించుకుంటూనే ఉన్నారు. అయితే తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రత్యేకించి తమ రాష్ట్ర అభివృద్ధి గురించి ఎవరు ఎంత మాట్లాడుకున్నా వివాదం ఉండదు. కానీ.. పక్క రాష్ట్రం గురించి మాట్లాడితేనే ఇబ్బంది.


ఇప్పుడు కేసీఆర్ అదే చేశారు. తెలంగాణలో భూముల విలువ బాగా పెరిగిందని చెప్పడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆంధ్ర ప్రదేశ్ తో పోల్చారు. గతంలో ఆంధ్రలో ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో మూడు ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేదన్నారు... కాని ఇప్పుడు భిన్నమైన పరిస్థితి ఉందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే.. ఏపీలో రెండు ఎకరాలు కొనుక్కోగలిగేలా ఇక్కడి భూములకు డిమాండ్‌ వచ్చిందని కెసిఆర్ అన్నారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ నేతలు మండిపడుతున్నారు.


తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హుందాగా లేవంటున్నారు ఏపీ నాయకులు. కేసీఆర్ ఏపీని కించపరుస్తున్నారని అంటున్నారు. ఏపీ టీడీపీ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల  బుచ్చయ్య చౌదరి ఈ అంశంపై స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వ్యాఖ్యలు హుందా గా లేవన్నారు. అంతే కాదు.. కేసీఆర్ వ్యాఖ్యల్ని ఏపీ ప్రభుత్వం ఖండిచకపోవటం దుర్మార్గం అంటున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గతంలో ఏపీ లో ఒక ఎకరం అమ్మితే తెలంగాణ లో మూడు ఎకరాల వచ్చేవి... ఇప్పుడు అది రివర్స్ అయిందన్న కేసీఆర్ మాటల్ని ఏపీ ప్రభుత్వం ఖండించకపోవడం దుర్మార్గమంటున్నారు.  

తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇది విన్నారా. లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

మరింత సమాచారం తెలుసుకోండి: