ఈ మధ్యకాలంలో  ఎక్కడ చూసినా దొంగలు బెడదా అంతకంతకూ పెరిగిపోతుంది. ఇంటికి తాళం కనిపిస్తే చాలు ఇక దొంగలు ఇంట్లోకి రహస్యంగా చొరబడి ఇల్లు గుల్ల చేస్తూ ఉంటారు. కాగా రోజు రోజుకు దొంగల బెడద పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక ఇల్లు వదిలి బయట కాలు పెట్టాలి అంటేనే భయపడిపోయే  పరిస్థితి ఏర్పడుతుంది నేటి రోజుల్లో. అయితే దొంగలు బెడదా రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ దొంగలు మాత్రం ఎంతో వినూత్న రీతిలో దొంగతనాలకు పాల్పడుతున్నారు.


 పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనాలకు పాల్పడుతూ ఇక పోలీసులకు ఎలాంటి ఆచూకీ లభించకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే దొంగ ఎంతో కష్టపడి ప్లాన్ వేసుకుని ఇక అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అనుకున్నట్టుగానే భారీగా నగదు నగలు దొరికాయి అంటే అతని ఆనందానికి అవధులు లేకుండా పోతాయ్.  అందిన కాడికి దోచుకుని అక్కడి నుంచి పరారవుతూ ఉంటాడు దొంగ. ఆ తర్వాత దొంగలించిన సొమ్ముతో జల్సాలు చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక దొంగకు మాత్రం అంత అదృష్టం లేకుండా పోయింది.  దొంగతనానికి వెళ్లి ప్లాన్ ప్రకారమే అంతా దోచుకున్నాడు కానీ అంతలో ఆనందం లో అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది.



 ఇంకేముంది ఎంతో కష్టపడి దోచుకున్న సొమ్ము అంతా చివరికి ఆసుపత్రి లో చికిత్స తీసుకోవడానికి సరిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ లో వెలుగులోకి వచ్చింది. కొత్వాలి  ప్రజా సేవా కేంద్రంలో ఫిబ్రవరి 7వ తేదీన ఇద్దరు దొంగలు చొరబడి ఇక ఏడు లక్షల రూపాయల నగదును దోచుకున్నారు. అయితే ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి విచారించగా ఇక దొంగలించిన డబ్బు మొత్తాన్ని ఆస్పత్రి ఖర్చు పెట్టాము అంటూ చెప్పుకొచ్చారు సదరు దొంగలు.

మరింత సమాచారం తెలుసుకోండి: