భారత దేశంలో ఎన్నో రకాల సంప్రదాయాలు, సాంఘ్యాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వాటిని గౌరవిస్తారు. అందులో భాగంగా తల నీలాలు ఇస్తారు. తల నీలాలు ఇచ్చిన ఓ డ్రైవర్ కు చేదు అనుభవం ఎదురైంది. గుండుతో విధుల్లో చేరేందుకు సిద్ధమైన ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. అతడి ముఖాన్ని ఉబర్‌ యాప్‌ గుర్తుపట్టక పోవడంతో ఉపాధికి దూరమయ్యాడు. ఈ వింత ఘటన హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్‌ శ్రీకాంత్‌కు ఎదురైంది. తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించుకున్న అతడు.. ఫిబ్రవరి 27న పలుమార్లు సెల్ఫీతో లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు.


నాలుగోసారి మళ్లీ ప్రయత్నిస్తే అతడి ఖాతా పూర్తిగా బ్లాక్‌ కావడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. దాదాపు ఏడాదిన్నరగా ఉబర్‌లో పనిచేస్తున్న అతడు ఇప్పటివరకు 1428 ట్రిప్‌లతో 4.67 స్టార్‌ రేటింగ్‌తో ఉన్నాడు. తనకు ఎదురైన ఇబ్బందిపై ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ విషయం గురించి ఉబర్ కార్యాలయానికి వెళ్తే, అక్కడ అతని కారుకు వేరే డ్రైవర్ ను నియమించారని చెప్పుకొచ్చారు .


ఉబర్‌ కార్యాలయానికి పలుమార్లు తిరిగితే.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఫిర్యాదు చేసేందుకు ఒక ఈ-మెయిల్‌ ఐడీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఇంకా ఆ వ్యవహారం నడుస్తూనే ఉంది'' అని వాపోయాడు.శ్రీకాంత్‌కు డ్రైవింగే జీవనాధారమని యాప్‌ ఆధారిత ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్ల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి షేక్‌ సలాయుద్దీన్‌ తెలిపారు. అతడి కారుకు ఈఎంఐ కూడా చెల్లించాల్సి ఉందన్నారు. లాక్‌డౌన్ సమయంలో అందరూ ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తుంది.గ్రీవెన్స్‌ కోసం సమర్థమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. శ్రీకాంత్‌కు ఎదురైన ఇలాంటి సమస్య మరో డ్రైవర్‌కు ఎదురవ్వకూడదని తెలిపారు.. ఇప్పుడు తన కుటుంబం రోడ్డున పడిందని వాపోయాడు.. ఇలాంటి ఘటన గతంలో ఒక డ్రైవర్ కు కూడా ఎదురైందని తెలుస్తుంది.. యాప్ ను మరో విధంగా అప్ డేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: