కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. కమల్ హాసన్ ఒక యూనివర్సల్ నటుడు.ఆయన యాక్టింగ్ తో అందరి మనసులను దోచుకున్నడు. దశావతారం సినిమాలో లోకనాయకుడిగా అవతారం ఎత్తి అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే  భారతదేశంలో పుట్టిన ఆస్కార్ స్థాయి నటుడు కమల్ హాసన్ అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అయితే సినీ రంగంలో ఒక ఎదురు లేని వ్యక్తిగా ముందుకుసాగుతున్న కమల్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా ప్రవేశించి తన అదృష్టాన్ని పరీక్షించు కోవాలనుకున్నాడు. ప్రస్తుతం ఈయన మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేతగా రాజకీయాల్లో తనదైన మార్క్ చుపించాలని రాజకీయాల్లో ప్రవేశిస్తున్నాడు. ఈయన అన్నాడీఎంకే, డీఎంకే తరుపన కాకుండా తృతీయ ప్రత్యామ్నాయంగా ఎన్నికల్లో బరిలో దిగారు.



తాజాగా జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన కోయంబత్తూర్ (దక్షిణం) నుంచి ఎమ్మెల్యేగా  పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడులో ఈ నెల  ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి .అయితే ఎన్నికలల్లో ప్రచారంగా భాగంగా  ప్రజలను తన పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఉన్నటుండి ప్రచారాన్ని షురూ చేసారు. అయితే కమల్‌ హాసన్ కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో ఉన్న ఒకప్పటి  సీనియర్ సినీ నటి, ఆయన అన్న చారుహాసన్‌ కుమార్తె అయిన  సుహాసిని కూడా కమల్ హాసన్ రాజకీయం పార్టీ ప్రచారంలో భాగమయ్యారు.


అలాగే వీరికి తోడుగా కమల్‌ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్‌ కూడా క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం పార్టీకి  సంబందించిన  ఫొటోలు, వీడియోలను ఆమె తరచూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో  ఎన్నికలో పోటీ చేయనున్న కమల్‌ హాసన్ కు ఓటువేసి గెలిపించాలంటూ  అక్షర హాసన్,  సుహాసిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో వీళ్లిద్దరూ కూడా అక్కడ  డప్పు చప్పుళ్లకు తీన్మార్‌ డ్యాన్స్‌లు చేసి జనాలను విపరీతంగా  ఆకట్టుకున్నారు. అక్కడ బ్యాండ్‌ సౌండ్‌కు ఎంతో ఉత్సహంగా  అదిరిపోయే స్టెప్పులేసిన వీరి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. !

మరింత సమాచారం తెలుసుకోండి: