ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తిరుగులేని పార్టీగా ఘన విజయం సాధించి అధికారం లో కొనసాగుతూ పాలనతో ఎంతో ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి తరుణంలో ఇక వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైయస్ షర్మిల ఇక అన్న పార్టీని వదిలి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త పార్టీ ప్రారంభించబోతున్నా అంటూ ప్రకటించడం సంచలనం గానే మారిపోయింది.  తాను తెలంగాణ కోడలని తెలంగాణలో ప్రజలు కష్టాలు తీర్చడానికి పార్టీ పెట్ట పోతున్నాను అంటూ ప్రకటించారు వైయస్ షర్మిల.



 అయితే వైయస్ షర్మిల పార్టీ పెట్ట పోతున్నాను అని ప్రకటించిన నాటి నుంచి కూడా ఇదే విషయం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇటీవల తెలంగాణ గుమ్మం ఖమ్మం లో భారీ బహిరంగ సభ నిర్వహించిన వైయస్ షర్మిల అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రజల తరఫున పోరాటం చేయడానికి తాను పార్టీని స్థాపించేందుకు సిద్ధమయ్యాను అంటూ వైఎస్ షర్మిల ప్రకటించారు. ఇక ఇప్పుడు వైయస్ షర్మిల సరికొత్త వ్యూహంతో ముందుకు కదిలేందుకు సిద్ధమవుతున్నారు అన్నది అర్ధమవుతుంది.



 క్రమక్రమంగా బలం పెంచుకునే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు వైయస్ షర్మిల అని అంటున్నారు విశ్లేషకులు. ఇటీవల కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేస్తాము అని చెప్పింది కానీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. అయితే దీనిపై షర్మిల దీక్షకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీన మూడు రోజుల పాటు దీక్ష చేపట్టేందుకు షర్మిల సిద్ధమైనట్లు సమాచారం. ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ కోసం ఈ దీక్ష చేస్తున్నట్లు ప్రకటించింది వైయస్ షర్మిల. అయితే ఇప్పటికే ఈ నెలాఖరు తర్వాత నోటిఫికేషన్ ఉంటుందని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రకటించారని.. ఇక ఇప్పుడు షర్మిల దీనికోసమే దీక్ష చేయడం ఆసక్తి కరం గా మారిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు.  ఏదేమైనా పార్టీ ప్రారంభ సమయంలో ఇలా ప్రజల కోసం పోరాటం మాత్రం మంచిది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: