తిరుపతి లో నిన్న ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు ఉప ఎన్నికల పోలింగ్ విజయవంతం గా జరిగింది. ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమం లో శ్రీకాళహస్తిలోని ఊరందూరు లో
టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. ఓటేసేందుకు వెళ్తున్న దళితులను అడ్డుకున్నారు.
టీడీపీ మాజీ
మంత్రి gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వగ్రామం లో దళితుల పై ఆయన అనుచరులు పెత్తనం చెలాయించారు.. ఓట్లు వేయడానికి వీల్లేదని అడ్డుకున్నారు. ఓటేసేందుకు వెళ్తే చంపుతామని బెదిరించిన సందర్భాలు లేకపోలేదు..
రక్షణ కల్పిస్తే ఓటింగ్ లో పాల్గొంటామమని దళిత ఓటర్లు తెలిపారు.
టీడీపీ మంత్రి అనుచరులు దళిత వాడకు వచ్చి దాదాగిరి చేస్తున్నారని, ఓట్లు వేయడానికి వస్తే తమ అంతు చూస్తానంటూ హెచ్చరించారని బాధిత ఓట్లర్లు తెలిపారు.ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు తమ గ్రామాన్ని శ్రీకాళ హస్తి మునిసిపాలిటీ లో విలీనం చేసినందుకు పోలింగ్ ను బహిష్కరిస్తున్నట్టు హకుం జారీ చేశారు.
గ్రామ కట్టుబాట్ల ను పాటించాలని హెచ్చరించి మధ్యాహ్నం వరకు ఎవరూ పోలింగ్‌లో పాల్గొనకుండా కాపు కాశారు. కాగా, ఈ విషయాన్ని కొందరు ఓటర్లు
మీడియా దృష్టికి తీసుకెళ్లగా.. సదరు
మీడియా బృందం ఊరందూరు
ఎస్సీ కాలనీకి చేరుకుని ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసుల సహకారంతో కాలనీకి చెందిన 12 మంది దళితులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రా పురం మండల పరిధి లో ఆరు గ్రామాలకు చెందిన ఎస్సీల ను 35 ఏళ్లుగా ఓటుహక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్న ఘటన
2019 సార్వత్రిక ఎన్నికల్లో వెలుగు చూడటం తెలిసిందే. గతంలో ఏపిలో జరిగిన ఎన్నికల్లో కూడా
టీడీపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడింది.. కేవలం ఓటమి భయం తోనే ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని
వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం రాజకీయ చర్చలకు దారి తీసింది..