ఆస్పత్రిలో చేరగానే రోగులు అందరినీ కూడా వెంటిలేటర్ పై ఉంచి ఒక ఆక్సిజన్ అందిస్తున్నారు ఆసుపత్రి సిబ్బంది. అయితే ఇలా రోజురోజుకు ప్రతి ఒక్కరికి కూడా ఆక్సిజన్ అందించడం తప్పనిసరిగా మారిపోయిన నేపథ్యంలో ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే కొంతమంది ఇక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా భారీగా డబ్బులు వెచ్చించి మరీ ఇక తమ ఇళ్ళల్లో ఆక్సిజన్ నిల్వలు ఉంచుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆక్సిజన్ నిల్వల ద్వారా కరోనా వైరస్ బారిన పడిన రోగులు శ్వాస ఇబ్బందులు ఉంటే కాస్త ఉపశమనం పొందుతున్నట్లు సమాచారం. కానీ ఆక్సిజన్ సిలిండర్ ఇళ్లల్లో నిల్వ ఉంచుకుంటే మాత్రం ఎప్పటికైనా ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు..
ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్ పేలి ఎంతో మంది మృత్యువాత పడ్డారు అన్న వార్తలు వెలుగులోకి వస్తున్న క్రమంలో ఇక ఇళ్లలో ఆక్సిజన్ పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు అంటున్నారు.అయితే ఆక్సిజన్ సిలిండర్ ఇళ్లల్లో నిల్వ ఉంచుకున్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అసలు ఆక్సిజన్ సిలిండర్ ను ఎలా ఉపయోగించాలి అన్నది తెలియకపోతే సోషల్ మీడియా వేదికగా ఆక్సిజన్ సిలిండర్ ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని తెలుసుకోవాలని అంతే కాకుండా పలువురు నిపుణులు సలహాలు సూచనలు కూడా తీసుకొని ఆక్సిజన్ సిలిండర్ ఉపయోగించాలని.. అంతేకాకుండా ఆక్సిజన్ సిలిండర్ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా చివరికి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను నిలబెట్టే ఆక్సిజన్ సిలిండర్ ప్రాణాలు తీస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు.