ఏపీలో కరోనా విజృంభిస్తోంది. అందుకు జగన్ విధానాలు, నిర్లక్ష్యమే కారణమంటున్నారు ప్రతిపక్షనేత చంద్రబాబు.. మొదటి నుంచి జగన్ నిర్లక్ష్యం చేశారని.. ప్రజలు ప్రాణాలు పోతున్నా పట్టడం లేదని మండిపడుతున్నారు. అయితే చంద్రబాబు విమర్శలను వైసీపీ నేతలు తిప్పి కొడుతున్నారు. చంద్రబాబు నాయుడు కుంగిపోయిన, కాలం చెల్లిన వృద్ధ మాంత్రికుడంటూ వైసీపీ నేత స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి  మండిపడ్డారు.

చంద్రబాబు తన ప్రపంచంలో తాను మాట్లాడుతున్నాడని... అందుకే విష ప్రచారాలు కొనసాగుతున్నాయ‌ని  వైసీపీ నేత స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి మండిప‌డ్డారు. చంద్రబాబు రాష్ట్రానికి చీడ‌లా మారార‌ని ఆయ‌న‌ విమ‌ర్శించారు. సంక్షోభ స‌మ‌యంలోనూ రాజ‌కీయాలు చేయ‌డం దుర‌దృష్టక‌ర‌మ‌న్నారు. ఆన్‌లైన్‌ వ్యవస్థ ఏర్పాటు చేశానని చంద్రబాబు చెబుతున్నాడు..అసలు ఆన్‌లైన్‌లో ఏం జరుగుతాయి?.. వ్యవసాయం ఆన్‌లైన్‌లో చేయొచ్చా?. పంటలు ఆన్‌లైన్‌లో పండించవచ్చా? ఇంట్లో వంటను ఆన్‌లైన్‌లో చేసుకుని తినగలమా? అని  వైసీపీ నేత స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి మండిప‌డ్డారు.

ఇక్కడ ఇవన్నీ ఇలా ఉంటే హైదరాబాద్‌లో కూర్చున్న చంద్రబాబు జూమ్‌ కాన్ఫరెన్స్‌లో రోజుకో మెసేజ్‌ ఇస్తున్నాడని  వైసీపీ నేత స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి అంటున్నారు.  రాష్ట్రానికి ఒక చీడ మాదిరిగా చంద్రబాబు మారాడని... వాటిని తీసుకుని రసగుళికలుగా తయారు చేస్తున్న ఒక సెక్షన్‌ ఆఫ్‌ మీడియా జనం మీదకు తోస్తుంటే అసహ్యం వేస్తోందని వైసీపీ నేత స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి మండిపడ్డారు. నిజానికి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, సంక్షోభాలు తలెత్తినప్పుడు రాజకీయాలు పక్కకు పోతాయి. ఎవరి చేతనైన సహాయం చేయడానికి సామాజిక సంస్థలు ముందుకు వస్తాయని వైసీపీ నేత స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి గుర్తు చేశారు.

గతంలో జగన్‌ ఏనాడూ..  టీడీపీ విఫలమైందని చెప్పలేదని... ఎవ్వరినీ విమర్శించడం లేదని... కానీ చంద్రబాబు మాత్రం పొద్దున లేచింది మొదలు అందరినీ రెచ్చగొట్టడుతున్నారని వైసీపీ నేత స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి అంటున్నారు. రాష్ట్రమంతా సంభవించిన ఈ ఉపద్రవంలో ధైర్యంగా పని చేశారని ఉద్యోగులను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు సజ్జల.

మరింత సమాచారం తెలుసుకోండి: