ఇలాంటి నేపథ్యంలో ఇక యువకులు వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అదేసమయంలో ఆసుపత్రులలో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనలతో కరోనా వైరస్ పేరెత్తితే జనాలు మొత్తం చిగురుటాకులా వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలాంటి భయాందోళనలో కూడా కొన్ని కొన్ని ఘటనలు మాత్రం అందరిలో ధైర్యాన్ని నింపుతున్నాయి. ఏకంగా వంద సంవత్సరాలు పైబడిన వారు సైతం వైరస్ బారినపడి ఇక ఆ వైరస్ ను జయించి కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్తున్న సంఘటనలు కరోనా భయాలను పారద్రోలుతుంది.
ఇక్కడ అందరిలో మరింత ధైర్యాన్ని నింపే ఓ ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే వందేళ్లు నిండిన ఓ బామ్మ కరోనా వైరస్ ను అంతం చేసింది. మహారాష్ట్రకు చెందిన సుశీల పాఠక్ అనే 102 ఏళ్ల మహిళ ఇటీవలే వైరస్ బారిన పడింది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంది. ఇక ఎక్కడా మనోధైర్యం కోల్పోకుండా 15 రోజులపాటు మహమ్మారి వైరస్ తో పోరాటం చేసింది. వైద్యుల సూచనలు సలహాలు పాటించి కరోనా వైరస్ బారి నుంచి బయట పడింది ఈ బామ్మ. ఈ క్రమంలోనే వైద్యులు ఈ భామకు కేక్ కట్ చేయించి ఇంటికి పంపించారు.