
రాత్రి సమయం లోనే కాదు పగలు సమయంలో కూడా కర్ఫ్యూ విధిస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్ని రకాల కార్యకలాపాలను అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇక ఆ తర్వాత పూర్తిగా కఠినమైన కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నిన్నటి నుంచి అమలు అవుతూ ఉండగా ఇక మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదు. పూర్తిగా రాష్ట్రం మొత్తం నిర్మానుష్యంగా మారిపోతోంది. ఇక కర్ఫ్యూ లో భాగంగా బ్యాంకు పని వేళలు కూడా మార్చింది రాష్ట్ర ప్రభుత్వం.
ఇక రాష్ట్ర ప్రభుత్వం మార్చిన బ్యాంకు పని వేళలను నేటి నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రాష్ట్రంలో 18 గంటల కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇక నేటి నుంచి 18వ తేదీ వరకు బ్యాంకులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పనిచేస్తాయి అంటే కేవలం ఒక్క రోజులో నాలుగు గంటలు మాత్రమే బ్యాంకులు అందుబాటులో ఉండనున్నాయి అందుకే తప్పనిసరి అయితేనే బ్యాంకులకు వెళ్లాలి అని అధికారులు సూచిస్తున్నారు త్వరగా పని పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకోవడం కూడా ఎంతో ఉత్తమం అని చెబుతున్నారు.