రెండో రకం కరోనా వైరస్ ప్రజలందరిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది నేపథ్యంలో ఎంతోమంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యల కారణంగా ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.ఆసుపత్రులలో రోజురోజుకు కరోనా వైరస్ రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న తరుణంలో ఇక అక్కడ సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రోజురోజుకు కరోనా వైరస్ రోగుల సంఖ్య ఎక్కువ అవుతున్న తరుణంలో ఎవరికి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
వరంగల్ సెంట్రల్ జైలు ను యుద్ధ ప్రాతిపదికన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గా మార్చాలి అంటు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసారు. కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎంజీఎం ఆసుపత్రి సరిపోవడం లేదు ఈ నేపథ్యంలోనే ఇక 73 ఎకరాల్లో విస్తరించి ఉన్న వరంగల్ సెంట్రల్ జైలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గా మార్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఐసీయూ ఆక్సిజన్ ప్లాంట్ క్రిటికల్ కేర్ లాంటి సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు ఇక జైలును వరంగల్ శివారు ప్రాంతాల్లో కి తరలించాలని.. ప్రాతిపదికన దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తి చేయాలని ఆదేశించారు.