నిజానికి కోవిడ్ మృతదేహాల విషయంలో ఇంత భయం అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించవచ్చని తెలియజేస్తున్నారు. ప్రాణం పోయిన తర్వాత శరీరంలో వైరస్ ఉత్పత్తి ఆగిపోతుంది. అప్పటికే బాడీలోని ప్లూయిడ్స్‌లో వైరస్ ఉన్నా దానికది ఇతర ప్రదేశాలకు వ్యాపించలేదు. ఆ మృతదేహాన్ని నేరుగా తాకడం, పైన పడి ఏడవడం, చనిపోయినవారి తల, ఇతర శరీర భాగాలను ఒళ్లో పెట్టుకుని ఏడవడం వంటివాటి వల్ల మాత్రమే వైరస్ విస్తరించే అవకాశం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కరోనా మృతదేహాన్ని ఉంచిన జిప్‌బ్యాగ్‌ను తెరవకుండా ఉంటే వైరస్ సోకే అవకాశం లేనట్టేనని అంటున్నారు. మృతదేహాల నుంచి ఇతరులకు వైరస్ సోకిన దాఖలాలు లేవని అప్పటికే వైరస్ సోకి, లక్షణాలు లేనివారు గుంపుగా ఉన్న జనంలో కలిసి దహన సంస్కారాల్లో పాల్గొనడం వల్లే వైరస్ విస్తరిస్తోందని చెప్తున్నారు.