ఏపీలో ప్రతిపక్ష టీడీపీ టార్గెట్ ఒక్కటే...నిత్యం జగన్‌పై ఏదొరకంగా విమర్శలు చేయడం. అసలు జగన్ సీఎం కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు ఆగడం లేదు. నిత్యం ఏదొక విషయంపై జగన్‌పై టీడీపీ నేతలు ఫైర్ అవుతూనే ఉంటారు. జగన్ ప్రజలకు మంచి పనులు చేసినా సరే టీడీపీ వాళ్ళు మాత్రం విమర్శించడమే పనిగా పెట్టుకుని ముందుకెళ్తారు.
అయితే జగన్‌కు పాలించడం చేతకాదని, ఆయన తాడేపల్లి ఇంటిలో నిత్యం పబ్జీ గేమ్ ఆడుతూ ఉంటారని ఆరోపణలు చేస్తుంటారు. ఈ విమర్శ ఎప్పటినుంచో జగన్‌పై చేస్తూ వస్తున్నారు. తాజాగా కూడా టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత సైతం ఈ రకమైన విమర్శలు చేస్తూ వచ్చారు. కరోనా నివారణ కంటే ప్రతిపక్షాలను వేధించడంపైనే సీఎం దృష్టి పెడుతున్నారని, ఆస్పత్రుల్లో కరోనా బాధితుల ఆర్తనాదాలు ముఖ్యమంత్రికి వినిపించడం లేదా అని మండిపడ్డారు.
ఇక సీఎం జగన్ కాసేపు పబ్జీ గేమ్ పక్కపెట్టి ఆస్పత్రులను సందర్శించాలని అనిత మాట్లాడారు. కరోనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబుపై క్రిమినల్ కేసు పెట్టారని, ఎన్440కె పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబితే కేసు పెడతారా అని ప్రశ్నించారు. అయితే ఇక్కడ సీఎం జగన్‌పై విమర్శలు చేయడం సహజమే. అసలు టీడీపీ నేతలు ఉన్నదే జగన్‌ని విమర్శించడానికే. కానీ ఇక్కడ జగన్ పాలన వదిలేసి పబ్జీ గేమ్ ఆడతారంటూ లేనిపోని ఆరోపణలు చేస్తుంటే కాస్త నమ్మశక్యంగా లేదు.
అసలు జగన్ పబ్జీ గేమ్ ఆడతారని టీడీపీ నేతలకు ఎలా తెలుసు. జగన్ ఇంటికెళ్ళి వీరు కూడా ఏమన్నా గేమ్ ఆడుతున్నారా? అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఏదో జగన్ ఫోన్‌లో ఏముందో కూడా వీళ్ళకు తెలిసినట్లు మాట్లాడుతున్నారని, ఇలాంటి అర్ధరహితమైన విమర్శలు ఏ మాత్రం సమంజసం కాదని అంటున్నారు. ఏదేమైనా జగన్ పబ్జీ గేమ్ ఆడుతున్నారనే విషయాన్ని టీడీపీ నేతలు వదిలేలా కనిపించడం లేదు. దీని వల్ల టీడీపీ వాళ్ళకు వచ్చే లాభం ఏమిటో మరి.