దేశంలో పరిస్థితులు రోజురోజుకీ ప్రమాదకరంగా  మారిపోతున్నాయి. సెకండ్ వేవ్ కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ను పట్టిపీడిస్తు.. విలయ తాండవం చేస్తూ మరణమృదంగం మోగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండిపోతుంది. దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతున్నాయి అంటే కరోనా వైరస్ కారణంగా మరణించిన మృతదేహాలకు  అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశాన వాటికలు లేకపోవడంతో చివరికి మృతదేహాలను నేరుగా నదీ జలాలలో పడేసే పరిస్థితులు వస్తున్నాయి.  ఈ క్రమంలోనే ఇటీవలే  గంగానదిలో పలు కరోనా మృతదేహాలను పడేయడం సంచలనంగా మారిపోయింది.


 అయితే గంగానదిలో మృతదేహాలను పడేయడం ఇక ఆ మృత దేహాలు ఒడ్డుకు కొట్టుకు రావడంతో అందరూ అవాక్కయ్యారు. గంగా నది లో కరోనా మృతదేహలు పడేయడం తో పూర్తిగా నదిలోని నీరు మొత్తం  కరోనా తో నిండి ఉంటుందని..  ఇక ఈ నీరు తాగితే ప్రమాదం అంటూ ఎన్నో అనుమానాలు కూడా రేకెత్తాయి.  ముఖ్యంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అయితే గంగా నదిలో నీళ్ళు తాగాలా వద్దా అనే దానిపై ఎంతో భయాందోళనకు గురవుతున్నారు. గంగానదిలో కరోనా మృత దేహాలను పడేస్తున్న నేపథ్యంలో నదిలో నీళ్ళు తాగితే కారణం వస్తుందేమో అని బెంబేలెత్తిపోతున్నారు. అయితే తాజాగా దీనిపై అధికారులు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.



 నది పరివాహక ప్రజలందరూ ఎవరూ భయపడవద్దని.. గంగా నది నీటిని శుద్ధి చేసే క్రమంలో ఇక వైరస్ నశిస్తుంది అంటూ అధికారులు చెప్పుకొచ్చారు. అయితే నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఎవరూ కూడా గంగా నదిలో నీరు నేరుగా తాగవద్దు అంటూ హెచ్చరించారు అధికారులు. ఏదేమైనా కరోనా వైరస్ మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కనీసం ఖననం చేసేందుకు స్థలం కూడా దొరకక పోవడంతో ఇక గంగా నది లో మృతదేహాలు పడేయడంతో కుప్పలు తెప్పలుగా  ఒడ్డుకు కొట్టుకు వస్తు ఉండడం మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది  ఇలాంటి ఘటనలు ప్రజలందరినీ బెంబేలెత్తిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: