దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ మహమ్మారి ఎక్కడి నుండి ఎలా సోకుతుందో అర్ధం కావడం లేదు. అందుకే వ్యక్తిత్వ శుభ్రతతో పాటుగా, ఇంటిని కూడాశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా ఇంట్లో రోజు ఏం శుభ్రపరచుకోవాలో చూద్దామా.

దేశంలో లాక్ డౌన్ ప్రకటించడంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రొమ్ హోమ్ ఇచ్చారు. ఇక రోజూ ఉపయోగించే కంప్యూటర్‌ కీబోర్డు మీద బోలెడన్ని క్రిములు వచ్చి చేరుతుంటాయి. వాటి ద్వారా వైరస్‌ సోకే ప్రమాదం చాలా ఎక్కువ. అందువల్ల సేఫ్‌ క్లీనర్‌ లేదా ఆల్కహాల్‌తో కీబోర్డు శుభ్రం చేసుకోవడం ఉత్తమం. మంచం, పరుపు, దుప్పటి, తలగడ మీద ఉండే బ్యాక్టీరియా వల్ల నిద్ర పట్టకపోవడమే కాకుండా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందువల్ల మంచాన్ని రోజూ రోజూ శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒక్క సారైనా బెడ్‌ షీట్లను ఉతుక్కోవాలి.

అంతేకాదు నీళ్లు తాగడానికి ఉపయోగించే బాటిల్‌ను రోజూ యాంటి బాక్టీరియల్‌ సబ్బు, వేడినీటితో కడగాలి. లేదా సహజంగా బ్యాక్టీరియాను చంపే గుణమున్న రాగి బాటిళ్లను ఉపయోగించడం మంచిది. వేళ్లకు పెట్టుకునే ఉంగరాల ద్వారా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. వాటిని యాంటీ బాక్టీరియల్‌ సబ్బు, వేడినీరు, లేదా ఆభరణాలను శుభ్రం చేసుకునే లిక్విడ్‌తో శుభ్రం చేయాలి. మనం రోజూ కొన్ని వందల సార్లు ఫోన్‌ స్క్రీన్ ను తాకుతూ ఉంటాము. దీని వల్ల హానికారక బ్యాక్టీరియా ఫోన్‌ మీదకు వచ్చి చేరుతుంది. అందువల్ల ఫోన్‌ను ఆల్కహాల్‌తో శుభ్రం చేసుకోవాలి. టీవీ, ఏసీ రిమోట్లను తరచూ తుడుస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

ఇక కాఫీ, టీ కప్పులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. అలాగే ఇంట్లోని వంటగదిని, ఇతర గదులను, పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగించే స్పాంజిలను ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేడి నీటిలో మరిగించాలి. డోర్‌ హ్యాండిల్స్‌, బాత్‌రూం సింక్‌ యాంటి బ్యాక్టీరియల్‌ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. పళ్లు తోముకునే బ్రష్‌ను యాంటి బ్యాక్టీరియల్‌ మౌత్‌ వాష్‌ ద్రావణంలో నానబెట్టడం వల్ల బ్రష్‌ మీద ఉండే బ్యాక్టీరియా నశిస్తుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: