దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు కరాళనృత్యం చేస్తుంది. శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. అదే సమయంలో ఎవరి పై కనికరం చూపకుండా అందరిలో ప్రాణ భయం కలిగిస్తోంది. ఇప్పటికే ప్రతి రోజూ వేల సంఖ్యలో ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటుంది. గత ఏడాది దేశంలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి  రూపాంతరం చెందుతూ అందరిలో ప్రాణ భయాన్ని పెంచుతుంది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతోంది.



 వెరసి దేశంలో రోజురోజుకు విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే గత ఏడాది కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తలో వైరస్ గురించి ఎలాంటి అవగాహన లేకపోవడంతో దేశ ప్రజానీకం మొత్తం చిగురుటాకులా వణికిపోయింది.  కానీ ప్రస్తుతం మహమ్మారి తో పోరాటం ఎలా చేయాలి అనే దానిపై దాదాపు అందరికీ అవగాహన ఉంది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా అందరికీ తెలుసు.. అదే సమయంలో ఒకవేళ పొరపాటున వైరస్ బారిన పడిన ఎంతో ధైర్యంగా పౌష్టికాహారం తీసుకుని మనోధైర్యంతో వైరస్నూ ఎలా జయించాలి అన్నదానిపై కూడా అందరికీ అవగాహన ఏర్పడింది.



 ముఖ్యంగా కరోనా వైరస్ ను జయించడంలో పౌష్టికాహారం ఎంతో ముఖ్యమైనది అని చెబుతూ ఉంటారు నిపుణులు. వైరస్ బారిన పడిన తర్వాత కోలుకునేందుకు కొన్ని రకాల ఆహారాలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.. ఈరోజు ఉదయం లేవగానే ఇక నీళ్ళల్లో నానబెట్టిన బాదం తో పాటు ద్రాక్ష తినాలి. వీటిలో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కరోనా నీరసాన్ని పోగొడతాయి. ఉదయం సమయంలో అల్పాహారంలో రాగి దోశ తీసుకోవడం ఎంతో మంచిది. ఇక మధ్యాహ్నం భోజనంలో లేదా భోజనం తర్వాత నెయ్యి, బెల్లం లాంటివి తినాలి. వీటిని రోటిలో కలుపుకొని కూడా తినవచ్చు. ఇక రాత్రి సమయంలో కిచిడీ తినడం వల్ల కావలసిన అన్ని పోషకాలు అందుతాయి అని చెబుతున్నారు నిపుణులు. ఇక నీళ్లు ఎక్కువగా తాగడం నిమ్మరసం, మజ్జిగ లాంటివి ఎక్కువ తాగడం కూడా చేయాలి అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: