ఏపీలో సిఐడి డిపార్ట్మెంట్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉందని చెప్పాలి. రఘురామ రాజు అరెస్ట్ కి సంబంధించిన విమర్శలు ఒక ఎత్తయితే, మరోవైపు టీడీపీ అభిమానులు నాయకుల విమర్శలు మరియు వివాధాలు మరో ఎత్తు. ఇంతటి ఒత్తిడిలోనూ సిబిఐ ఒక మంచి పని చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే, ఇంతకు ముందు దిశ పోలీస్ స్టేషన్ లను ఎలా అయితే మహిళలు మరియు చిన్న పిల్లల సంరక్షణ కోసం తీసుకువచ్చారో, ఇప్పుడు అదే తరహాలో మానవ అక్రమ రవాణా నిరోధానికి పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.  యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) లకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ హోదా కల్పించనున్నారు. వీటిని ఏపీలోని అన్ని జిల్లాలోనూ ఏర్పాటు చేయదనాయికి సిఐడి నిర్ణయం తీసుకుంది.

 ఈ పోలీస్ స్టేషన్ మెయిన్ ఉద్దేశ్యం, అక్రమ రవాణాకు గురయిన బాధితులను రక్షించడానికి ఈ AHTU లను నెలకొల్పుతున్నారు. అంతే కాకుండా ఈ అక్రమ రవాణాకు పాల్పడే ముఠాలను సైతం పట్టుకుని వారి ఆట కట్టించే విధంగా ఇవి పనిచేయనున్నాయని తెలుస్తోంది. ఈ యహతు బృందంలో ఉండే అధికారులకు ఏ హద్దులు ఉండవు, ఈ ఏరియా, ఆ ఏరియా అని రిస్ట్రిక్షన్స్ ఉండవు. రాష్ట్రంలో ఎక్కడ అక్రమ రవాణా జరిగినా శిక్షించే అధికారం వీరికి ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆదేశాలు నిన్న హోమ్ శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఇవ్వడం జరిగింది. ప్రతి AHTU స్టేషన్ కు ఒక సిఐ, ఇద్దరు ఎస్సై లు, హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ లను నియమించనున్నారు.  


ఈ స్టేషన్ లో ఉండే పోలీసులుకు మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వారి ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు తగిన శిక్షణను ఇస్తారు. ఈ టీం లు దిశ పోలీస్ లు మరియు సివిల్ పోలీస్ లను సమన్వయము చేసుకుంటూ మానవ అక్రమ రవాణాకు సంబంధించి చర్యలు తీసుకుంటాయని తెలుస్తోంది. అక్రమ రవాణాలో ఉన్న బాధితులకు పునరావాసం కల్పించేందుకు మిగిలిన శాఖల అధికారులతో కూడా సమన్వయము చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ బాధితులకు తక్షణ రక్షణ కల్పించడం మరియు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని కూడా అందించడం వీరి బాధ్యతని తెలుస్తోంది. ముఖ్యంగా చూస్తే, ఈ రోజుల్లో ఎంతోమంది ఆడపిల్లలు మరియు మహిళలను అక్రమంగా బలవంతంన్గా వ్యభిచార వృత్తులలోకి దించడానికి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా పాల్పడుతూ ఉంది. అయితే ఈ AHTU ల వలన ఎంతోమంది ఆడపిల్లలు మహిళలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇది చాలా మంచి నిర్ణయంగా ప్రజల చేత కొనియాడబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: