హైదరాబాద్ లో శనివారం అనేక ప్రాంతాల్లో స్విగ్గి, జోమాటో డెలివరీ బాయ్స్ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని..లాక్ డౌన్ ఎత్తివేసేవరకు మళ్లీ వాహనాలను తిరిగి ఇవ్వమని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ ను  కఠినంగా అమలు చేయాలని కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఫుడ్ డెలివరికీ అనుమతులు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించినప్పటికీ ప్రస్తుతం కఠిన ఆంక్షలు అమలు చేయాలని వచ్చిన ఆర్డర్స్ తో పోలీసులు మరింత స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చాలా మంది స్విగ్గి, జోమాటో, ఊబర్ ఈట్స్ కు సంబంధించిన పాత ఐడీ కార్డులను పట్టుకుని రోడ్లపైకి వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దాంతో ఈరోజు ఉదయం 10 గంటల తరవాత నుండి రోడ్లపైకి వస్తున్న డెలివరీ బాయ్స్ బండ్లను లాక్కుంటున్నారు. తాము ఫుడ్, మెడిసిన్ డెలివరీ చేస్తున్నామని చెప్పినా పోలీసులు వినిపించుకోవడం లేదు.

 అంతే కాకుండా డెలివరీ బాయ్స్ ను లాఠీలతో కొడుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అందువల్లే ఈరోజు డెలివరీ చేసేందుకు భయటకు వచ్చామని డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి రోడ్డు పై కనిపిస్తే తమకు రూ.1000 జరిమానా వేస్తున్నారని  సమాచారం ఇవ్వకపోవడం పోలీసుల తప్పని చెపుతున్నారు. తమకు సాయంత్రం 4 గంటల వరకు పర్మిషన్ ఉన్నట్టు కంపెనీ నుండి మెసేజ్ లు వస్తున్నాయని కానీ పోలీసులు వెళ్ళనివ్వడంలేదని చెపుతున్నారు. ఇదిలా ఉండగా ఉదయం నుండి బైకులను సీజ్ చేస్తున్న క్రమంలో స్విగ్గీ ఫుడ్ డెలివరినీ ఇప్పటికే నిలిపివేసింది. పోలీసులు డెలివరీ బాయ్స్ ను కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజెన్ లు డెలివరీ బాయ్స్ కే మద్దతు తెలుపుతున్నారు. లాక్ డౌన్ వేళ ఎంతోమంది ఆకలి తీరుస్తున్నారని వారికి పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: