రేవంత్ రెడ్డి..తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడు. కొన్నేళ్ళ పాటు టీడీపీలో కీలకంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి....తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చి కేసీఆర్‌పై పెద్ద యుద్ధమే చేస్తున్నారు. మామూలుగా టీడీపీలో ఉన్నప్పుడు అంతా రేవంత్ రెడ్డి చెప్పినట్లే జరిగేది. కానీ ఆ పార్టీ కథ క్లోజ్ అయిపోవడంతో కాంగ్రెస్‌లోకి వచ్చారు. అయితే కాంగ్రెస్‌లో అందరూ నాయకులే.


దీంతో రేవంత్, కేసీఆర్‌పై చేసే పోరాటానికి పెద్ద మద్ధతు ఉండటం లేదు. పైగా తనకు పి‌సి‌సి పగ్గాలు రాకుండా కాంగ్రెస్‌లో పెద్ద నాయకులు అడ్డుపడుతున్నారు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా సరే రేవంత్, కేసీఆర్ ప్రభుత్వంపై నిత్యం పోరాడుతూనే ఉన్నారు. తనకు మద్ధతు ఇచ్చే కొంతమంది నాయకులతో కలిసి కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అయితే రేవంత్ ఎంత పోరాడుతున్న పెద్ద ఫలితం ఉండటం లేదు.


ఇప్పటికే కాంగ్రెస్‌ని కేసీఆర్ గట్టిగా దెబ్బకొట్టారు. చాలా జిల్లాల్లో కాంగ్రెస్ బలం తగ్గిపోయింది. ఆ విషయం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలిసింది. దుబ్బాక ఉపఎన్నిక, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఇటీవల జరిగిన ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులెత్తేసింది. అయితే ఇక్కడ కాంగ్రెస్‌కు మింగుడు పడని విషయం ఏంటంటే, టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ వచ్చేసింది. దుబ్బాక, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది.


ఈ పరిస్తితులని చూస్తే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీల మధ్యే అసలు ఫైట్ జరుగుతుందని విశ్లేషణలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ మరింతగా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్-బీజేపీలు ఒక్కటే అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే టార్గెట్‌తో ముందుకెళుతున్నారు. కానీ రేవంత్ కష్టానికి సొంత పార్టీ నాయకులే ప్రతిఫలితం లేకుండా చేస్తున్నారని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీ పగ్గాలు రేవంత్‌కు అప్పగించి, ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే బాగుంటుందని, లేదంటే అంతే సంగతులు అంటున్నారు. మరి చూడాలి రేవంత్‌కు పీసీసీ అధ్యక్షుడుగా ఛాన్స్ వస్తుందో లేదో?  

మరింత సమాచారం తెలుసుకోండి: