నగరాలు పట్టణాలే కాదు గ్రామాలను కూడా వదలలేదు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలలో కూడా గ్రామాల ప్రజలు సైతం కరోనా వైరస్ తో బెంబేలెత్తిపోతున్నారు. వైరస్ పేరెత్తితే చాలు చిగురుటాకులా వణికిపోతున్నారు. కానీ ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలు వైరస్ రహిత ప్రాంతాలుగా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని చింతల గిరిజన గూడెం లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా వెలుగులోకి రాలేదు. ఈ గిరిజన గూడెం నల్లమల్ల అభయారణ్యంలో ఉంది. అభయారాణ్యమే తమకు శ్రీరామ రక్షగా నిలుస్తుందని అని చెబుతున్నారు ఆ గిరిజన గూడెం ప్రజలు. ఈ అభయారణ్యంలో దొరికే ఔషధ మొక్కలు ఇక తమ ప్రాణాలను కాపాడుతున్నాయి అని అంటున్నారు.
సాధారణంగా ఎవరైనా సరే జ్వరం లాంటివి వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు పరుగులు పెడతారు. ఇక్కడ మాత్రం అలా కాదు జ్వరం కాదు ఇంకేం వచ్చినా కూడా అక్కడ దొరికే ఆకు పసర్లతో నే అవన్నీ తగ్గించుకుంటారు. ఇలా ఎన్నో ఔషధ మొక్కల కారణంగానే తమలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉందని.. అందుకే ఇప్పటి వరకు తమ గూడెం లో ఒక్క కరోనా కేసు కూడా వెలుగులోకి రాలేదు అని చెబుతున్నారు అక్కడి స్థానికులు. అభయారణ్యంలో ఔషధ మొక్కల నుంచి స్వచ్ఛమైన గాలి.. అక్కడి పరిస్థితులు.. ఆహ్లాదకరమైన వాతావరణం కారణంగా ప్రజలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని.. ఇక తమ ప్రాంతంలో ఎన్నో ఔషధ మొక్కలు కూడా దొరుకుతాయి అని స్థానికులు చెబుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఎన్నో గ్రామాలు వైరస్ బారినపడి విలవిలలాడుతుంటే ఈ గూడెం మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.