అయితే ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలలో మొదటిది రెండు రూపాయలకే కిలో బియ్యం. పేదవారి కడుపు నింపాలని ఎన్టీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. 1980లో ఈ పథకం అనేది పెద్ద సంచలనంగా మారింది. ఈ పథకాన్ని ఆ తర్వాతి ప్రభుత్వాలు కూడా అమలు పరచడం విశేషం. ఎన్టీఆర్ హయాంలో తీసుకొచ్చిన మరో ముఖ్య పథకం మద్యపాన నిషేధం. అలాగే ఇంటర్ తరవాత ఇంజనీరింగ్ విద్య కోసం రాసే పరీక్షగా అయినా ఎంసెట్ ను ఎన్టీఆర్ ప్రభుత్వమే తీసుకొచ్చింది. అలాగే పటేల్, పట్వారి విధానాలను రద్దు చేసి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు ఎన్టీఆర్.
ఇక ట్యాంకుబండ్ లోని విగ్రహాలను ఎన్టీఆర్ హయాంలోనే నెలకొల్పడం జరిగింది. హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ ప్రభుత్వమే. అలాగే తన ఐదేళ్ల పాలనలో సుమారు ఐదు లక్షల ఇండ్లను పేదలకు నిర్మించి ఇచ్చారు. స్థానిక సంస్థల్లో రేజర్వేషన్లు, ఇంకా ప్రభుత్వ పాఠశాలలో భోజన వసతిని కూడా ఎన్టీఆర్ హయాంలోనే అమలు చేశారు. అలాగే ఆసియ లోనే పెద్ద ప్రయాణ ప్రాంగణం అయినా మహాత్మా గాంధీ బస్సు స్టేషన్ ను ఎన్టీఆర్ ప్రభుత్వంలోనే నిర్మించడం విశేషం. అప్పట్లో మద్రాస్ లో ఉన్న సినిమా ఇండస్ట్రీ ని హైదరాబాద్ కు తరలించడంలో ఎన్టీఆర్ ముఖ్యపాత్ర పోషించారు.