ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇక అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే ప్రస్తుతం జగన్ పథకాల ద్వారా దాదాపుగా ప్రతి ఏటా ఒక కుటుంబంలో 50 వేల వరకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు. తద్వారా మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇలా సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం ఎక్కువగా అవుతుండడం ద్వారా ఇక రాబోయే ఎలక్షన్లలో ప్రజలందరూ ఇంతకంటే ఎక్కువగా ఎవరు ఇస్తారు అనేదే చూస్తున్నారని.. సంక్షేమ పథకాల ద్వారా డబ్బును పొందడం తమ హక్కుగా భావిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.
ఒకవేళ వచ్చే ఎలక్షన్లలో టీడీపీ ఓటర్లను ఆకర్షించాలన్నా.. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అందిస్తున్న దానికంటే ఎక్కువ సంక్షేమ పథకాల ద్వారా అందిస్తామని హామీ ఇస్తే ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఉందని.. రోజురోజుకు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఆర్థిక సహాయం పెరిగితే ప్రజలు పనులు చేసుకోవడం మానేసి సోమరులుగా మారే అవకాశం ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఇలాంటి సమయంలో.. టిడిపి ఒక క్లారిటీ తో సంక్షేమంపై సమరం చేస్తే బాగుంటుంది అని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ విషయంలో టిడిపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.