ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన మీటింగ్ కు ఎందుకు హాజ‌ర‌వ్వ‌లేక‌పోయార‌ని అల‌ప‌న్ బందోపాధ్యాయకు నిన్న కేంద్రం నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో వివ‌రణ ఇవ్వాల‌ని ఆదేశించింది. అయితే నోటీసులు అందుకున్న బంధోపాద్యాయ బెంగాల్ చీఫ్ సెక్ర‌ట‌రీగా రాజీనామా చేశారు. అంతే కాకుండా వెంట‌నే మ‌మ‌తా బెన‌ర్జీ చీఫ్ అడ్వైజ‌ర్ గా నియమించ‌బ‌డ్డారు. సోమ‌వారం బంధోపాద్యాయ సీఎస్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌గా మ‌మ‌తా బెన‌ర్జీ ఆయ‌న్ని త‌న ముఖ్య‌స‌లహా దారునిగా నియ‌మించికుని పంతం నెగ్గించుకున్నారు. కేంద్ర‌మే ఆదేశించినా లెక్క చేయ‌కుండా సీఎస్ బందోపాధ్యాయ ముఖ్య సల‌హాదారుడిగా ఉండేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రోవైపు ఎన్నో విమ‌ర్శలు వ‌స్తున్నా సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా వెన‌క్కి త‌గ్గ‌డంలేదు. సీఎస్ ను వెన‌క్కి పంపేది లేద‌ని త‌న ముఖ్య‌స‌ల‌హాదారుణిగా నియ‌మించుకుని ఆయ‌నకు నెల‌కు రూ. 2.5 ల‌క్ష‌ల వేతనం ఇవ్వ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా బెంగాల్ చీఫ్ సెక్రట‌రీ సీఎస్ అలపన్ బందోపాధ్యాయను కేంద్రం రీకాల్ చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 

నాలుగు రోజుల క్రితంమే ఆయ‌న సీఎస్ సీఎస్ ప‌ద‌వీకాలాన్ని మూడు నెల‌ల పాటు పొడిగించిన‌ కేంద్రం రీకాల్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ప‌శ్చ‌మ‌బెంగాల్ లో యాస్ తుఫాన్ కార‌ణంగా జ‌రిగిన న‌ష్టంపై ప్ర‌ధాని అధికారులు మ‌రియు నేత‌ల‌తో స‌మీక్ష‌స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ద‌న‌క‌ర్, బెంగాల్ ప్ర‌తిప‌క్ష‌నేత సువేందు అధికారి హాజ‌రుకాగా ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అర‌గంట ఆల‌స్యంగా వ‌చ్చారు. అంతే కాకుండా తుఫాన్ న‌ష్టంపై ప్ర‌ధానికి ఓ ప‌త్రం అంద‌జేసి వెళ్లిపోయారు. సీఎస్ స‌హా ఉన్న‌తాధికారులెవ‌రూ ఈ స‌మావేశానికి హాజ‌ర‌వ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో మ‌మ‌త పై స‌ర్వ‌త్రా విమ‌ర్ష‌లు వ‌చ్చాయి. ప్ర‌ధానికి మీటింగ్ హాజ‌ర‌వ్వ‌ని కార‌ణంగానే సీఎస్ ను రీకాల్ చేస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. సీఎస్ ను ఢిల్లీలో రిపోర్ట్ చేయాల‌ని కేంద్రం ఆదేశించింది. కానీ మ‌మ‌తా బెన‌ర్జీ అల‌ప‌న్ బంధోపాద్యాయ‌ను త‌న ముఖ్య స‌లహాదారుణిగా నియ‌మించుకుని కేంద్రానికి మ‌రో షాక్ ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: