
ప్రజలకు రెండు డోసులు కూడా ఒకటే వ్యాక్సిన్ (కొవాగ్జిన్ లేదా కోవిషీల్డ్) ఇవ్వాలని కేంద్రం విస్పష్టం చేసింది. వ్యాక్సిన్‌లు మిక్సింగ్ చేయాలని ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రస్తుతానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కి (సమాన ప్రక్రియ పద్ధతి) కట్టుబడి ఉంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించింది.
మొదటి డోసులో ఒక రకం టీకా తీసుకొని రెండవ డోసులో మరొక రకం టీకా తీసుకోవడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాక్సినేషన్ మిక్సింగ్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టీకాలను కలపడం వలన ఎలాంటి హానికరమైన ప్రభావాలు కలుగుతాయో తెలుసుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయని.. ఈ విషయాన్ని తేల్చాలని శాస్త్రవేత్తలు జిజ్ఞాస తో ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రెండు డోసులలో వేర్వేరు టీకాలు ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందా లేదా అనే విషయం పై తాము పరిశోధన చేస్తున్నామని నీతి అయోగ్ సభ్యులు చెప్పారు. కోవిషీల్డ్ సెకండ్ డోసు పన్నెండు వారాల తర్వాత ఇస్తే.. కొవాగ్జిన్ సెకండ్ డోసు 4 - 6 వారాల తర్వాత ఇవ్వాలని నీతి ఆయోగ్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇదే షెడ్యూల్ ని పాటిస్తూ ప్రజలకు వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.