వాస్తవానికి 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచీ జీడీపీ క్రమంగా తగ్గుతూ వచ్చి, కరోనా దెబ్బకు ప్రతికూల వృద్థిలోకి జారిపోయినట్టు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనినే ప్రస్తావిస్తూ గడచిన నాలుగు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ పనితీరు తీవ్ర నిరాశ కలిగిస్తోందని, మొదటి రెండు త్రైమాసికాల్లో రెసిషన్ -24.4, -7.4 శాతంగా ఉండగా, మూడు, నాలుగో త్రైమాసికాల్లో కూడా కోలుకోలేని పరిస్థితే నెలకొందని చిదంబరం తెలిపారు. జాతీయ గణాంకాల కార్యాలయం సోమవారంనాడు విడుదల చేసిన గణాంకాలను ప్రస్తావిస్తూ, నాలుగో క్వార్టర్‌లో 1.6 శాతం వృద్ధి నిరాశాజనకమన్నారు. గత ఏడాది కరోనా తగ్గినట్టు కనిపించిన సమయంలో ఆర్థిక మంత్రి, ఆమె ప్రధాన ఆర్థిక సలహాదారు ఆర్థిక వ్యవస్థ స్థ కోలుకుంటోందని, వి-స్పీడ్ రికవరీ అంటూ కట్టుకథలు చెప్పారని చిదంబరం విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు గట్టి చర్యలు చేపట్టకుంటే మరింత సంక్షోభం తప్పదని ఆయన హెచ్చరించారు. . గత ఏడాదితో పోల్చుకుంటే తలసరి జీడీపీ 8.2 శాతం తగ్గిందని, దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికంలోకి వెళ్లిపోయారన్నారు. సెకెండ్ కోవిడ్ వేవ్‌తో కోటి మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని, 97 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిందని ఇచ్చిన సీఎంఐఈ నివేదికను ఆయన ప్రస్తావించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ అసమర్థ ఆర్థిక నిర్వహణతోనే దేశానికి ఈ కష్టాలు వచ్చాయని, దేశాన్నిఈ పరిస్థితినుంచి గట్టెక్కించేందుకు ఇప్పటికైనా ఆర్థిక నిపుణుల సలహాలు, విపక్షాల అభిప్రాయాలు తీసుకోవాలని చిదంబరం డిమాండ్ చేశారు. మరి మాజీ ఆర్థికమంత్రి సూచనలకు మోదీ ప్రభుత్వం ఏమాత్రం గౌరవమిస్తుందో చూడాల్సి ఉంది.