2011 మార్చి 10న హైదరాబాదులోని నక్లెస్ రోడ్డు నుంచి మార్చ్ చేసేందుకు ఉద్యమకారులు ముందస్తు వ్యూహాలు సిద్దం చేసుకున్నారు. మార్చ్ ను ఫెయిల్ చేయాలని ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగించింది. జిల్లాల బార్డర్లలో పోలీసుల దిగ్భంధాలు, అడ్డంకులు, బ్యారికేడ్లు, ఇనుపకంచెలూ తెలంగాణ వాదులను ఆపలేకపోయాయి. హైదరాబాదు నగరమంతా పోలీసులను, పారామిలటరీ బలగాలను మోహరించినా ఫలితం లేకుండా పోయింది. ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టలేనంత పక్కాగా ప్లాన్ చేసుకున్నారు తెలంగాణ వాదులు. ఇందిరా పార్కు ప్రాంతం లోని ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్ళి ఏర్పాట్లు చేసుకుని పెళ్ళి బృందంలా ట్యాంక్ బండ్ పైకి వచ్చారు. మధ్యాహ్నం వరకే 10 తెలంగాణ జిల్లాల్లో పోలీసుల నిర్బంధం తీవ్రమైంది. మొత్తం తెలంగాణలో 1,00,000 మంది ప్రజలను ముందస్తుగా అదుపులోకి తీసుకోగా, ఒక్క హైదరాబాదులోనే 11,000 మందిని అరెస్టు చేశారు.