పరిపాలన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కొన్ని కొన్ని సంచలన నిర్ణయాల విషయంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. రాజకీయంగా ఎవరెన్ని విమర్శలు చేసినా సరే జగన్ మాత్రం తాను తీసుకునే నిర్ణయాల విషయంలో స్పష్టంగా ముందుకెళ్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలక ఐఏఎస్ అధికారులు అందర్నీ కూడా బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు తీసుకున్నారు. బ‌దిలీ చేసిన అధికారుల వివ‌రాలు చూస్తే...డాక్టర్ వెంకటేశ్వరన్ ను చిత్తూరు జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. టీ. నిశాంతిని అనంతపురం హౌసింగ్ జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. 

గోపాలకృష్ణ రోనంకిని పాడేరు ఐ.టి.డి.ఎ, పి ఓ గా బదిలీ చేశారు. టి ఎస్ విశ్వనాథన్ ను, ప్రకాశం జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. హెచ్ఎం. ధ్యాన చంద్ర ను వైఎస్ఆర్ కడప జిల్లా హౌసింగ్ జాయింట్ సెక్రటరీగా బదిలీ చేశారు. యం. జాహ్నవిని తూర్పు గోదావరి జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా బదిలీ చేస్తూ నిర్ణ‌యం తీస‌కున్నారు. ఎం. మౌర్యాని కర్నూలు జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. ఎస్ నుపూర్ అజయ్ కుమార్ ను కృష్ణా జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా బదిలీ చేశారు. అనుపమ అంజలిని గుంటూరు జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా బదిలీ చేశారు.

విదే కారే ని నెల్లూరు జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా బదిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. జీ సూర‌జ్ ను ధనంజయుని పశ్చిమ గోదావరి జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా బదిలీ చేశారు. కల్పనా కుమారి ని విశాఖ జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా బదిలీ చేశారు. మయూర్ అశోక్ ను విజయనగరం జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా బదిలీ చేశారు. హిమాన్షు కౌశిక్ ను శ్రీకాకుళం జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా బదిలీ చేశారు. ఎస్ కృష్ణమూర్తిని వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ఆగ్రోస్ కు బదిలీకు బ‌దిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: