తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి, ప్రతిపక్షానికి పరిమితమై రెండేళ్ళు అయింది. అయితే ఈ రెండేళ్ల కాలంలో వైసీపీ ఇంకా బలపడుతుంటే, టీడీపీ మాత్రం ఇంకా వీక్ అవుతూ వస్తుంది. పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు, పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించిన పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఏదో ఒకరు, ఇద్దరు మినహా మిగిలిన పార్లమెంట్ అధ్యక్షులు దూకుడుగా పనిచేయలేకపోతున్నారు.
ప్రకాశం జిల్లాలో కీలకంగా ఉన్న ఒంగోలు పార్లమెంట్ స్థానంలో టీడీపీ అధ్యక్షుడుది అదే పరిస్తితి. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడుగా నూకసాని బాలాజీ ఉన్నారు. అధ్యక్షుడుగా ఎంపికైన సమయంలో బాలాజీ కాస్త హడావిడిగానే తిరిగారు. కానీ తర్వాత నుంచి అసెంబ్లీ స్థానాల వారీగా నాయకులతో సమావేశమై, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు ఏమి చేసినట్లు కనిపించలేదు.
అటు అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు కూడా సైలెంట్‌గానే ఉన్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో యర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కొండపిలో టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి కాస్త యాక్టివ్‌గానే ఉంటున్నారు. ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్...మునుపటి దూకుడు ప్రదర్శించడం లేదు. గతంలో జనార్ధన్ ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా పని చేశారు. అప్పుడు యాక్టివ్‌గానే ఉన్న జనార్ధన్, ఈ మధ్య పార్టీలో పెద్దగా కనిపించడం లేదు. కనిగిరిలో ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సైతం యాక్టివ్‌గా లేరు.
ఇక దర్శిలో పమిడి రమేష్ కాస్త పార్టీ తరుపున బాగానే తిరుగుతున్నారు. మార్కాపురంలో కందుల నారాయణరెడ్డి, యర్రగొండపాలెంలో అజిత రావు, అశోక్ రెడ్డిలు సైతం పార్టీలో అడ్రెస్ లేరు. అయితే వీరిని యాక్టివ్ చేసి, పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత పార్లమెంట్ అధ్యక్షుడు బాలాజీది. కానీ బాలాజీ ఆ దిశగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. అటు ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా ఏ నాయకుడు లేరు. ఇక్కడ ఇన్‌చార్జ్‌ని పెట్టాల్సిన అవసరముంది. మొత్తానికైతే ఒంగోలులో తమ్ముళ్ళు బాగా రెస్ట్ తీసుకుంటున్నట్లు ఉన్నారు. ఇక వీరిని చంద్రబాబు సెట్ చేయాల్సిన అవసరముంది.