మద్యం మత్తులో కొన్ని కొన్ని సార్లు మందుబాబులు సృష్టించే వీరంగం మామూలుగా ఉండదు.  ఒక్కసారి పెగ్గు పడిన తర్వాత ఇక నడి రోడ్డు పైకి వచ్చి తామేం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఉండి పోతారు మందుబాబులు. ఈ క్రమంలోనే మందుబాబులు చేసే వీరంగం కాస్త ఎంతో మందికి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది.  కొన్ని కొన్ని సార్లు మందుబాబులు తప్పతాగి రోడ్డు మీదికి వచ్చి చివరికి ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం లాంటివి చేస్తూ ఉంటారు.దీంతో పోలీసులు రంగంలోకి దిగి మందుబాబులకు సరైన బుద్ధి చెబుతూ ఉంటారు.  ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  ఇక్కడ యువకుడు మాత్రం మాత్రం సాగలేదు ఏకంగా గంజాయి మత్తులో ఫుల్లుగా మద్యం తాగిన ఓ యువకుడు రోడ్డు మీదికి వచ్చి వీరంగం సృష్టించాడు. వచ్చే పోయే వాహనాలను ఆపుతూ అటు అసభ్యకరమైన పదజాలంతో ఎవర్నో తిడుతూ హల్చల్ చేశాడు.  అంతేకాదు పోలీసులు వచ్చిన భయపడేది లేదు అంటూ ఏకంగా ఒక కారు ఎక్కి కూర్చున్నాడు.  దీంతో ట్రాఫిక్ కి ఎంతగానో అంతరాయం కలిగింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.  అయితే అతను అలా  ఊరికే అలా వచ్చి వీరంగం సృష్టించలేదు.. ఏకంగా ఒంటి మీద ఉన్న బట్టలు మొత్తం తీసేసాడు.



 కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలను అడ్డుకుని కారు పైకి ఎక్కి ఏకంగా చుక్కలు చూపించాడు కిక్కు వీరుడు.  ఇక కార్ ముందుకు వెళుతుంటే కారు ఆపేందుకు కార్ కిందికి దూరేందుకు ప్రయత్నించాడు. దాదాపు గంట సేపటి వరకు ఇలా హంగామా సృష్టించాడు ఈ గంజాయి బాబు. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇక అతన్ని పట్టుకున్నారు. ఇక ఆ తర్వాత అతని వివరాలు ఆరా తీయగా... అతని పేరు రాజు అని వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలో ఉన్న ఒక మారుమూల గ్రామానికి చెందినవాడు అన్న విషయాన్ని గుర్తించారు పోలీసులు. గంజాయి కి అలవాటు పడి చివరికి మత్తులో వీరంగం సృష్టించినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు  .

మరింత సమాచారం తెలుసుకోండి: