ఇలాంటి నేపథ్యంలో కరోనా వైరస్ పరిస్థితుల్లో కూడా డ్యూటీ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి భారీ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేదంటే మరికొన్ని రోజుల్లో ఇక తాము సమ్మెకు దిగుతాము అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించింది ఎంప్లాయిస్ అసోసియేషన్. ఇది కాస్త ప్రస్తుతం తెలంగాణలో సంచలనంగా మారిపోయింది ఇటీవల జూనియర్ డాక్టర్ల సమ్మె ముగిసింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కూడా తమ డిమాండ్లు నెరవేర్చాలి అంటూ ప్రభుత్వాన్ని కోరుతుంది. లేదంటే సమ్మె సైరన్ మోగించటం ఖాయం అంటూ హెచ్చరిస్తుంది.
డ్యూటీ లో కరోనా వైరస్ తో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కరోనా తో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి సర్కారు కొలువు ఇవ్వాలి అంటూ సరికొత్త డిమాండ్ను తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రభుత్వం ముందు ఉంచింది. కరోనా పాజిటివ్ గా తేలిన ఉద్యోగులందరికీ 21 రోజులపాటు క్యాజువల్ లీవ్ ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. కరోనా తో పాటు బ్లాక్ ఫంగస్ లాంటి వ్యాధులను అటు ఆరోగ్యశ్రీ తో పాటు హెల్త్ స్కీమ్ లో చేర్చి నగదు రహిత చికిత్సను తమకు అందించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం తమ డిమాండ్లపై వెంటనే స్పందించాలని లేదంటే ఉద్యమం చేపడతామని అంటూ తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ హెచ్చరించింది.