బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు విష్ణు కుమార్ రాజు రాష్ట్ర ప్ర‌భుత్వంపై మ‌రియు జీవీఎంసీ అధికారుల‌పై మండి ప‌డ్డారు . మాన‌సిక విక‌లాంగుల స్కూలును కూల్చ‌డంపై ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. ...ప్రజా వేదిక కూల్చడం ద్వారా ప్రారంభమైన కూల్చివేతల కార్యక్రమం ఇప్పుడు మానసిక వికలాంగుల స్కూలును కూల్చేదాకా వ‌చ్చింద‌ని అన్నారు. జీవీఎంసీ అధికారులకు మొంట‌ల్ వచ్చిందేమో అర్థం కావడం లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అధికార మదం తో కొంత మంది జీవీఎంసీ అధికారులు విర్ర‌వీగుతున్నార‌ని ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌తో సభ్య సమాజం తలదించుకోవాల్సిన అవసరం వచ్చిందని అన్నారు .

జీవీఎంసీ అధికారులు మనుషులా పశువులా..అంటూ మండి ప‌డ్డారు. ఈ ప్రభుత్వం  రాక్షస ప్రభుత్వం.. ప్రజలారా మేల్కోండి.. విoతైన ముఖ్యమంత్రి మ‌న ముఖ్యమంత్రి అంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రం లో వచ్చిన ఆదాయాన్ని అంతటిని ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుతున్నారని విష్ణు కుమార్ రాజు ఆరోపించారు. పోలీస్ లు అపర్ణ విషయాన్ని రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని... ఇలాంటి జబ్బు  విశాఖ‌ప‌ట్ట‌ణానికి వచ్చిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డాక్టర్ సుధాకర్ ని చంపింది ప్రభుత్వమేని ఆయన చనిపోయే వరకు ప్రభుత్వం కక్ష సాధింపు చేసింద‌ని సంచ‌ల‌న ఆరోపణ‌లు చేశారు .

నియంత పాలన ఎలా ఉంటుందో రాష్ట్రంలో పోలీసులు చూపించాలని అనుకుంటున్నారా..? అంటూ పోలీసుల‌ను ప్ర‌శ్నించారు. జగన్ మెప్పు కోసం కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీ కోటలను బద్దలు కొట్టేస్తున్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు ... ఢిల్లీ గురించి మాట్లాడితే మీ కోటలు బీటలు వాలిపోతాయి జాగ్రత్త..అంటూ విష్ణు కుమార్ రాజు ఎమ్మ‌ల్యేల‌ను హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ఏ పథకం ప్రారంభించినా ముఖ్యమంత్రి ఫోటో తప్పితే మరొక‌రి ఫోటో కనిపించదు... మంత్రులెవరు ఉపముఖ్యమంత్రి ఎవరో ప్రజలకు తెలిసేలా అప్పుడప్పుడు ఫోటోలు వేయండంటూ వ్యంగ్యాస్థ్రాలు కురింపించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: