విధుల్లో ఉన్న వైద్యులు కు భద్రత కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ఓకే చెప్పిందని తెలిపారు. ఇన్సెంటీవ్స్ విషయంలో సిఎం తో చర్చించి నిర్ణయం చేయాల్సి ఉందన్నారు. స్టైఫండ్ ను విడతల వారీగా పెంచుతామని ఆళ్ల నాని హామీ ఇచ్చారని తెలిపారు. జూనియర్ డాక్టర్ లు కూడా హర్షం వ్యక్తం చేస్తూ... విధులకు హాజవుతామని చెప్పారని అన్నారు. జనవరి 2020లో జుడాలకు స్టైఫండ్ పెంచామని అన్నారు. పే రివిజన్ వచ్చే జనవరిలో ఉంటుంది.. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదన్నారు.
చర్చల అనంతరం జూనియర్ డాక్టర్ అచ్యుత్ మీడియాతో మాట్లాడుతూ.......మా డిమాండ్ ల పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కోవిడ్ వల్ల చనిపోయిన వైద్యులు కు 25లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తామని ప్రకటించింది. కరోనా వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చింది. భద్రతా పరమైన భరోసా కు సంబంధించి జిల్లా కలెక్టర్ లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తామన్నారు. స్టైఫండ్ ను ఆరు నెలల్లో పెంపును అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ల కు కూడా స్టైఫండ్ పెంచారు. కరోనాతో మరణించిన యువ వైద్యురాలు సీమా కుటుంబానికి మూడు రోజుల్లోపు 25 లక్షలను అందిస్తామని హామీ ఇచ్చారు. టిడియస్ విషయంలో ఇతర రాష్ట్రాలలో పరిశీలించి నిర్ణయం చేస్తామన్నారు. కోవిడ్ ఇన్సెంటీవ్స్ విషయాన్ని సిఎం దృష్టి కి తీసుకెళ్లి పరిశీలన చేస్తామన్నారు. స్టైఫండ్ ను విడతల వారీగా పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మా డిమాండ్ ల పై సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమిస్తున్నాం.