ఇక కొన్ని కొన్ని సార్లు అటు భూ యజమానికి సంబంధించిన వివరాలు కూడా అడుగుతూ ఉంటారు. ఇక్కడ అధికారులు ఇలాంటివే అడిగారు. కానీ ఆ రైతు ఇక అధికారులు అడిగిన ఆధార్ కార్డు తెచ్చేందుకు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆధార్ కార్డు తీసుకురావడానికి అన్నీ ఇబ్బందులు ఎందుకు అని అంటారా.. అయితే అధికారులు అడిగింది ఒక సాదాసీదా మనిషి ఆధార్ కార్డు కాదు.. ఏకంగా దేవుడి ఆధార్ కార్డు అడిగేస్తారు. దేవుడి ఆధార్ కార్డును అధికారులు ఎందుకు అడుగుతారు.. అని అంటారా దీని వెనుక పెద్ద స్టోరీ ఉంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుర్హారా గ్రామానికి చెందిన రామ్ కుమార్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న సీతారామ ఆలయంలో పూజారి. ఈ క్రమంలోనే ఆలయ భూమిలో గోధుమ పంట వేశాడు సదరు పూజారి. పూజారి పండించిన గోధుమ పంటను మార్కెట్ కి తీసుకెళ్లి అమ్మాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ప్రభుత్వం మార్కెట్ యార్డుకు వెళ్ళాడు రామ్ కుమార్. అయితే భూ యజమాని ఆధార్ కార్డు ఉంటేనే పంట కొనుగోలు చేస్తామని అక్కడి అధికారులు చెప్పడంతో షాక్ అయ్యాడు. ఇది శ్రీ సీతారామ ఆలయానికి సంబంధించిన భూమిలో పండించాను అంటూ అధికారులకు చెప్పినప్పటికీ అధికారులు మాత్రం వినలేదు. ఆధార్ కార్డ్ ఉంటే తప్ప పంట కొనుగోలు చేసేది లేదు అంటూ తేల్చి చెప్పారు. దీంతో నీకు ఆధార్ కార్డు తెచ్చేది ఎలా చెప్పు స్వామీ అంటూ దేవుడిని వేడుకుంటున్నాడు ఆ పూజారి.