మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తాజాగా ప్రెస్ మీట్ లో ఈట‌ల రాజేంద‌ర్ ను విమ‌ర్శిస్తూ కామెంట్లు చేశారు. తాను అధికారం తో సంబంధం లేకుండా దాదాపు 33 సం లుగా రాజకీయాల్లో వున్నానని క‌డియం శ్రీహ‌రి అన్నారు. అంతే కాకుండా ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేర‌డంపై క‌డియం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈటల రాజేందర్ బీజేపీ లో చేరడం ఆయన వ్యక్తిగతమ‌ని వ్యాఖ్యానిస్తూనే అనాల్సిన‌వ‌న్నీ అనేశారు. మీ వామపక్ష సిద్దాంతాలు ఏమయ్యాయంటూ ఈట‌ల రాజేంద‌ర్ ను ప్ర‌శ్నించారు. పార్టీ అధ్యక్షుడు కాకుండా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మరో వ్యక్తి సమక్షంలో బీజేపీలో చేరడం ఏంటి..? అని ప్ర‌శ్నించారు. ఈట‌ల‌ ఆస్తులను కాపాడుకోవడం కోసమే బీజేపీ లో చేరారని అనిపిస్తుందంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఏమిటి...? అని క‌డియం సూటి ప్ర‌శ్న వేశారు. 

పేద ప్రజల ఆహార అలవాట్ల మీద కూడా బీజేపీ దాడి చేసిందంటూ క‌డియం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అది తెలిసి కూడా బీజేపీ లో ఈట‌ల రాజేంద‌ర్ ఎలా చేరారని అన్నారు. మీలో ఉన్న కమ్యూనిస్ట్ చనిపోయాడా...? ఏం ఉద్ధరించడానికి మీరు బీజేపీ లో చేరారంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ లో ఏ మేరకు ప్రజాస్వామ్యం ఉందని మీకు అనిపించింది.? అంటూ క‌డిగిపారేశారు. కేసీఆర్ పై ఈట‌ల‌ వాడిన భాష సరిగ్గా లేదు...వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న ఈట‌ల ఇప్పుడు ఫ్యూడల్ వ్యవస్థ గురించి మాట్లాడడం ఏంటని ప్ర‌శ్నించారు. 5 సం క్రితమే సీఎం తో మనస్పర్థలు వస్తే ఇప్పుడు మీకు ఆత్మాభిమానం గుర్తుకు వచ్చిందా....? అంటూ ప్ర‌శ్నించారు. దాదాపు 26 లక్షల రూపాయల రైతు బంధు తీసుకున్న ఈట‌ల రైతు బంధు గురించి తప్పుగా ఎలా మాట్లాడుతారని ప్ర‌శ్నించారు. కేసులకు భయపడే ఈట‌ల‌ బీజేపీ లో చేరారంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న పార్టీ అని క‌డియం మండి ప‌డ్డారు. 

ఇదిలా ఉండ‌గా క‌డియం ప్ర‌స్తుతం ప‌దవిలో లేకున్నా ఈట‌ల‌పై ఈ రేంజ్ లో రెచ్చిపోవ‌డానికి కార‌ణంగా ఆయ‌న మ‌ళ్లీ కేసీఆర్ కు ద‌గ్గ‌ర‌వ్వ‌డం కోస‌మేన‌ని అనిపిస్తోంది. దానికి కార‌ణంగా క‌డియం అసంతృప్తితో ఉన్నార‌ని గ‌త కొద్దిరోజులుగా వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. బీజేపీలో చేర‌తార‌ని కూడా వార్త‌లు వినింపించాయి. అంతే కాకుండా ఉమ్మ‌డి జిల్లాలో కేసీఆర్ క‌డియంకు ప్రాధాన్య‌త‌ను కూడా త‌గ్గించారన్న విష‌యం జ‌గ‌మెరిగిన సత్యం. ఈ నేప‌థ్యంలో క‌డియం తాను బీజేపీలో చేరే స‌మ‌స్యే లేద‌ని చెప్పేందుకే బీజేపీపై విమ‌ర్ష‌లు చేశారేమో అనిపిస్తుంది. అంతే కాకుండా మ‌ళ్లీ కేసీఆర్ కు ద‌గ్గ‌ర‌వ్వ‌డానికే ఈట‌ల‌పై తూటాలు కురింపించిన‌ట్టు క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: