గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచి రికార్డు క్రియేట్ చేసిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద రావు నియోజకవర్గంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాపాక పవన్‌కు షాక్ ఇవ్వడంతో రాజోలు నియోజకవర్గంలోని జనసేనపార్టీ నేతలు, కార్యకర్తలు రాపాకకు దూరమయ్యారు.. పోనీ వైసీపీ కార్యకర్తలు ఏమైనా ఆయనకు దగ్గరయ్యారా అంటే అదీ లేదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొంతు రాజేశ్వర్ రావుకు అధిష్టానంతో రాపాక బాగానే చెక్ పెట్టించారు. తర్వాత రాజోలుకు తుని నియోజకవర్గానికి చెందిన మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ కి కో ఆర్డినేటర్ పదవి ఇచ్చారు.
ఇప్పుడు ఆమెతోనూ రాపాకకు పడట్లేదు. ఇప్పుడు ఆమెను కూడా మార్చాలని రాపాక పట్టుబట్టినా జగన్ వినలేదు. ఎన్నిసార్లు కో ఆర్డినేటర్లను మార్చుకుంటూ పోతాం అని ఫైర్ అయ్యారు. ఇక్కడ అమ్మాజీ కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో రాపాకకు తిరుగులేదు. కానీ ఆ పార్టీ కేడర్ మాత్రం ఆయన్ను ఓన్ చేసుకోలేకపోతోంది. అసలు రాపాక తమ పార్టీ వాడే కాదని చెపుతున్నారు. దీంతో నియోజకవర్గంలో బలమైన వైసీపీ కేడర్ ఆయన్ను పట్టించుకోకపోవడంతో ఆయన అసలు సిసలు వైసీపీ నేత కాకుండా పోతున్నారు.