జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసింది...ఈ రెండేళ్లలో సీఎంగా జగన్‌కు మంచి మార్కులే పడుతున్నాయి..మంత్రులు కూడా పర్వాలేదనిపిస్తున్నారు...మరి ఎమ్మెల్యేల పరిస్తితి ఏంటి? అంటే మెజారిటీ ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. కాకపోతే వారికి జగన్ ఇమేజ్ మాత్రమే బాగా ప్లస్ అవుతుందని తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలు అడ్వాంటేజ్ అవుతున్నాయి.


అదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు వైసీపీ ఎమ్మెల్యేలకు ప్లస్ అవుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ 14 గెలుచుకోగా, టీడీపీ 2 గెలుచుకుంది. టీడీపీ నుంచి గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తర్వాత వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో వైసీపీ బలం 15కు చేరుకుంది. ఇక టీడీపీకి మిగిలింది గద్దె రామ్మోహన్ మాత్రమే. ఎమ్మెల్యేగా గద్దె పర్వాలేదనిపిస్తున్నారు.


అయితే మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జ్‌లు ఎలా పనిచేస్తున్నారు? అంటే కొందరు బాగానే పనిచేస్తున్నారు. కొందరు మాత్రం పార్టీలో కనిపించడం లేదు. అలాంటి వారి వల్ల వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. పామర్రులో వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఉన్నారు. రెండేళ్లలో ఈయన అద్భుతమైన పనితీరు ఏమి కనబర్చలేదు. ప్రభుత్వ పథకాలు, ఇక్కడ టీడీపీ నాయకురాలు ఉప్పులేటి కల్పన సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఎమ్మెల్యేకు ప్లస్ అవుతుంది.


అటు అవనిగడ్డలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఉన్నారు. ఈయన ప్రత్యర్ధిగా ఉన్న మండలి బుద్దప్రసాద్ టీడీపీలో యాక్టివ్‌గా ఉండటం లేదు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదు. దీంతో అవనిగడ్డలో ఎమ్మెల్యేకు అడ్వాంటేజ్ అవుతుంది. నూజివీడులో అదే పరిస్తితి. ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌కు టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరావు బాగా ప్లస్ అవుతున్నారు. ఈయన నియోజకవర్గంలో సమస్యలపై పోరాటం చేయకపోవడం వల్ల ఎమ్మెల్యేకు బెన్‌ఫిట్ అవుతుంది. ఇలా కృష్ణా జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ప్రజల మధ్య లేకపోవడం వల్ల వైసీపీ ఎమ్మెల్యేలకు అడ్వాంటేజ్ అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: