కమలా హ్యారీస్ ఇమ్మిగ్రేషన్ సదుపాయాలను పరిశీలించారు. సరిహద్దుకు దూరంగా ఉంటున్న 9-16 సంవత్సరాల వయస్సు గల వలస బాలికలను పరామర్శించారు. గతేడాది సరిహద్దు ప్రజలను రెండు తుఫానులతో పాటు కరోనా మహమ్మారి తీవ్రంగా వేధించింది. దీంతో పేదరికం తాండవించింది. ఇపుడు అక్కడ పరిస్థితులను చక్కదిద్దేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది.
అంతేకాదు హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఈ నెల మొదట్లో మెక్సికో.. గ్వాటెమాలో పర్యటనకు వెళ్లారు. వలసలు రికార్డు స్థాయిలో పెరగడానికి బైడెన్ పరిపాలన విధానాలను కారణమని ఇరుదేశాల అధ్యక్షులు ఆరోపించారు.
లాటిన్ అమెరికాలో పేదరికం, అవినీతి, సామూహిక హింస నుండి పారిపోతున్న శరణార్థులు, ఆర్థిక వలసదారుల సంఖ్య వేసవి నెలల్లో మాత్రమే పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ సంవత్సరం అమెరికా సరిహద్దు ఏజెంట్లు ఉగ్రవాద వాచ్‌లిస్ట్‌లో ఉన్న ఇద్దరు యెమెన్ వ్యక్తులను విడివిడిగా పట్టుకున్నారు.
మరి కమలా హ్యారీస్ సరిహద్దుల్లో పర్యటన ఏ మాత్రం సత్ఫలితాలిస్తుందో చూడాలి. వలస సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ప్రతిపక్షాలు చెవులుకొరుక్కుంటున్నాయి. బైడెన్ ఎన్నికల ప్రచారంలో చేసిన హామీల అమలును నిశితంగా గమనిస్తున్నాయి. ఎక్కడ ఏమాత్రం లొసుగులు దొరికినా.. గోరంత దాన్ని కొండంత చేసి చూపిస్తున్నాయి ప్రతిపక్షాలు. అంతేకాదు కరోనా కట్టడిపై విమర్శలు కూడా చేస్తున్నాయి. అటు బైడెన్ ప్రభుత్వం ప్రతిపక్షాల విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్తలు పడుతోంది. బైడెన్ ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి సారించింది. పగడ్బంధీ ప్రణాళికలు రచిస్తోంది. అటు కమలా హ్యారీస్ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.