
డ్రోన్ దాడి చేయడం అంటే ఇక యుద్ధం కిందికే వస్తుందని.. అటు రక్షణ రంగ నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ డ్రోన్ దాడి కాశ్మీరు లోయలో నుంచి జరిగిందా లేక పాకిస్తాన్ నుంచి పంపించారా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రస్తుతం సైన్యం విచారణ మొదలుపెట్టింది. ఒకవేళ పాకిస్తాన్ నుంచి పంపించి ఇక కాశ్మీర్లోని ఎయిర్బేస్ టార్గెట్ చేసినట్లు తేలితే ఇక భారత ఆర్మీ మొత్తం పాకిస్తాన్ ఎయిర్ బేస్ లపై విరుచుకు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు రక్షణ రంగ నిపుణులు.
ఒకవేళ పాకిస్తాన్ సైన్యం కాకుండా ఉగ్రవాదులు ఈ డ్రోన్ కెమెరాలు పంపించినట్లు తేలితే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా భారత సైన్యం మరో సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. అయితే గతంలోనే పుల్వామా దాడి తర్వాత భారత సైన్యం విరుచుకుపడింది. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా యుద్ధ విమానాలతో విరుచుకుపడి సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఇక ఇప్పుడు కూడా ఏ క్షణంలో భారత్ ఎలా స్పందించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంచనా వేస్తున్నారు రక్షణ రంగ నిపుణులు. ఇక డ్రోన్ దాడితో ఇమ్రాన్ ఖాన్ మోడీ కి ఒక పరీక్ష పెట్టారు అని అంటున్నారు. ఇక రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.